Google: అంకుర సంస్థ‌లు ప్రారంభించాల‌నుకుంటోన్న వారికి గూగుల్ గుడ్‌న్యూస్

స్టార్ట‌ప్‌లు ప్రారంభించాల‌నుకుంటోన్న వారికి గూగుల్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా ప్రోగ్రామ్‌ను గూగుల్ సంస్థ ప్రారంభించింది. తొమ్మిది వారాల పాటు కొన‌సాగే ఈ వ‌ర్చువ‌ల్‌ కార్య‌క్ర‌మం ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 10,000 స్టార్టప్‌లకు గూగుల్ సాయం చేయ‌నుంది.

Google: అంకుర సంస్థ‌లు ప్రారంభించాల‌నుకుంటోన్న వారికి గూగుల్ గుడ్‌న్యూస్

Google Chrome Users At High Risk, Should Update Browser Immediately

Google: స్టార్ట‌ప్‌లు ప్రారంభించాల‌నుకుంటోన్న వారికి గూగుల్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా ప్రోగ్రామ్‌ను గూగుల్ సంస్థ ప్రారంభించింది. తొమ్మిది వారాల పాటు కొన‌సాగే ఈ వ‌ర్చువ‌ల్‌ కార్య‌క్ర‌మం ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 10,000 స్టార్టప్‌లకు గూగుల్ సాయం చేయ‌నుంది. స్టార్ట‌ప్‌లకు సాధార‌ణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు గూగుల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. స్టార్ట‌ప్‌లు మెరుగైన ఉత్పత్తిని రాబ‌ట్టేందుకు కావాల్సిన ప్లాన్‌లు, యాప్‌ల రూపకల్పనలో సాయం, ఆయా సంస్థ‌లు కొత్త యూజర్లను ఆక‌ర్షించేందుకు పాటించాల్సిన ప్ర‌ణాళిక‌లు వంటి వాటిపై గూగుల్ శిక్ష‌ణ ఇస్తుంది.

Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు

స్టార్టప్‌ల‌కు సంబంధించిన కీల‌క వ్య‌క్తుల‌తో ముఖాముఖి కూడా నిర్వ‌హిస్తుంది. కాగా, హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద సిటీలే కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా అంకుర సంస్థ‌ల‌ను స్థాపిస్తున్నారు. ఈ క్ర‌మంలో చాలా స్టార్ట‌ప్‌లు పెట్టిన ఐదేళ్ళ‌కే మూతబడుతున్నాయి. అందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. ఖర్చులు, డిమాండ్‌ను స్టార్ట‌ప్‌లు అంచనా వేయ‌లేక‌పోవ‌డం, ఆయా సంస్థ‌లకు స‌రైన రీతిలో నేతృత్వం వ‌హించే వారు లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. వీరికి గూగుల్ సాయం చేయ‌నుంది. స్టార్ట‌ప్‌ల‌లో భార‌త్ ప్ర‌పంచంలో మూడో స్థానంలో ఉంది. దేశంలో 70,000కి పైగా స్టార్టప్‌లు ఉన్నాయి.