ఆ ఆరుగురిలో మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ ఎవరు

మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్‌ పదవి కోసం

  • Publish Date - November 26, 2019 / 07:39 AM IST

మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్‌ పదవి కోసం

మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు(నవంబర్ 27,2019) బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్‌ పదవి కోసం ప్రభుత్వం.. ఆరుగురి పేర్లను ప్రతిపాదించింది. ఆ ఆరుగురి పేర్లను గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీకి పంపించారు.

బీజేపీ ఎమ్మెల్యేలు రాధాకృష్ణ వైఖే పాటిల్‌(6సార్లు ఎమ్మెల్యే), కాళిదాస్‌ కోలంబ్కర్(8 సార్లు ఎమ్మెల్యే)‌, బాబన్‌రావు(7 సార్లు ఎమ్మెల్యే) ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి బాలసాహెబ్‌ థోరత్‌(8 సార్లు ఎమ్మెల్యే), కేసీ పద్వి(7సార్లు ఎమ్మెల్యే) ఉన్నారు. ఎన్సీపీ నుంచి దిలీప్‌ వాల్సే పాటిల్‌ పేరుని ప్రభుత్వం ప్రతిపాదించింది.

వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలసాహెబ్‌ థోరత్, బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ అత్యంత సీనియర్లుగా ఉన్నారు. సభలో అత్యంత సీనియారిటీ ఉన్న వారికే ప్రొటెం స్పీకర్‌ పదవి అప్పజెప్పడం జరుగుతుంది. ఈ ఆరుగురిలో ఒక్కరి పేరును గవర్నర్‌ ఖరారు చేసే అవకాశం ఉంది.

* ప్రొటెం స్పీకర్‌ పదవికి పేర్లు ప్రతిపాదించిన ప్రభుత్వం
* ఆరుగురి పేర్లను గవర్నర్‌కు పంపించిన ఫడ్నవీస్‌ ప్రభుత్వం
* ఆరుగురిలో ముగ్గురు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్‌, ఒకరు ఎన్సీపీ
* బీజేపీ ఎమ్మెల్యేలు: రాధాకృష్ణ, కాళిదాస్‌, బాబన్‌రావు భికాజీ 
* కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు: బాలసాహెబ్‌ థోరత్‌, కేసీ పద్వి 
* పరిశీలనలో ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్‌ వాల్సే పాటిల్‌ 
* అత్యంత సీనియర్లుగా బాలసాహెబ్‌(కాంగ్రెస్), కాళిదాస్‌(బీజేపీ)
* ఆరుగురిలో ఒకరి పేరును ఫైనల్ చేయనున్న గవర్నర్