ముంబై.. చెత్తపై ఎందుకు పన్ను వేస్తుందంటే..?

భారతదేశ సంపన్న నగరమైన ముంబై.. చెత్త సేకరణపై పన్ను విధించాలని యోచిస్తోంది. జనన ధృవీకరణ పత్రాలు జారీపై  అదనపు సుంకాలు విధిస్తోంది. 

  • Publish Date - February 7, 2020 / 03:09 PM IST

భారతదేశ సంపన్న నగరమైన ముంబై.. చెత్త సేకరణపై పన్ను విధించాలని యోచిస్తోంది. జనన ధృవీకరణ పత్రాలు జారీపై  అదనపు సుంకాలు విధిస్తోంది. 

భారతదేశ సంపన్న నగరమైన ముంబై.. చెత్త సేకరణపై పన్ను విధించాలని యోచిస్తోంది. ముంబై.. భారతదేశ ఆర్థిక కేంద్రం, దేశంలోని ధనిక మున్సిపాలిటీగా పేరుంది. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఆదాయాన్ని పెంచడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. రియల్ ఎస్టేట్ నుండి ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. చెత్త సేకరణపై కూడా పన్ను విధించింది. జనన ధృవీకరణ పత్రాలు జారీపై  అదనపు సుంకాలు విధిస్తోంది. 

ముంబై మహానగర పాలక సంస్థ.. న్యూయార్క్ నగరంలోని సగం ప్రాంతాన్ని కలిగి ఉంది. కానీ అక్కడి కంటే ముంబైలో 50% ఎక్కువ మంది జనాబా ఉంది. గతంలో అనుకున్న 238.5 బిలియన్ రూపాయల ఆదాయం లక్ష్యం కంటే 5% పడిపోయింది. ముంబైలో ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తున్నాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ముంబై బడ్జెట్  పెద్దది. స్థానిక వ్యయం ప్రభావం చూపడంతో దేశ ఆర్థిక పునరుజ్జీవనం బలహీనం పడింది. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం..రాష్ట్రాలు ఖర్చు చేస్తున్న ప్రతి 1 రూపాయి రూ.1.07 దిగుబడి రూపాయలు వస్తే అందులో ప్రభుత్వానికి 0.4 వెళ్తోంది.

ప్రస్తుతం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ఖర్చులను దాదాపు 9% పెంచాలని ముంబై యోచిస్తోంది. వర్షకాలం నాటికి నగరంలో తుఫాను వరదలను నివారించడానికి మెరుగైన నీటి కాలువలను నిర్మించాలని భావిస్తోంది. 

ప్రధాన ఆదాయ వనరులు తగ్గడంతో ” వనరుల సమీకరణకు వినూత్న చర్యలను అనుసరించాలని కార్పొరేషన్ యోచిస్తోందని మదన్ సబ్నావిస్ సహా కేర్ రేటింగ్స్ ఆర్థికవేత్తలు తెలిపారు. ఆస్తి పన్ను, నీటి పన్ను ఎగవేతదారులకు నోటీసులు జారీ చేయడం ద్వారా బకాయిలు తిరిగి పొందాలని యోచిస్తున్నట్లు తెలిపారు. నీటి కనెక్షన్ల డిస్కనెక్ట్, ఆస్తుల వేలం వేయాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. 

2017 వరకు ముంబైకి వచ్చిన మొత్తం ఆదాయంలో మూడో వంతు సంపాదనను ఆక్ట్రాయ్ లేదా ఎంట్రీ లెవీ ద్వారా పొందింది. ఇది దేశవ్యాప్తంగా వస్తువులు, సేవల పన్నుతో భర్తీ చేశారు. తర్వాత తగ్గింపులో కొంత భాగాన్ని భర్తీ చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. భారతదేశంలో ఆర్థిక మందగమనం ఉండటంతో ప్రభుత్వం సెప్టెంబరు నిధులు బదిలీ చేయలేకపోయింది. మిగిలిన నిధులు రెండు దఫాల్లో ఇస్తామని ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిబ్రవరి 3న పార్లమెంటులో చెప్పారు.