Wild Elephant: ఛత్తీస్‌గడ్‌లో దారుణం.. ఏనుగు చేసిన పనికి తండ్రి, కూతురు మృతి
ఛత్తీస్‌గడ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏనుగు చేసిన పనికి ఆరేళ్ల చిన్నారితో పాటు 25ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లా బెల్గావ్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలోకి ఏనుగు ప్రవేశించడమే కాకుండా గులాబ్ సింగ్ గోండ్(25) అనే వ్యక్తిని, ఆయన ఆరేళ్ల కుతురిని తొక్కి చంపింది..
- Harishth Thanniru
- Published On : May 23, 2022 / 10:01 AM IST
Elephant
Wild Elephant: ఛత్తీస్‌గడ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏనుగు చేసిన పనికి ఆరేళ్ల చిన్నారితో పాటు 25ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లా బెల్గావ్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలోకి ఏనుగు ప్రవేశించడమే కాకుండా గులాబ్ సింగ్ గోండ్(25) అనే వ్యక్తిని, ఆయన ఆరేళ్ల కుతురిని తొక్కి చంపింది. గోండ్ భార్య సునీత ఏనుగు దాడి నుంచి ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు గ్రామస్థుల సహయాంతో గజరాజును అక్కడినుండి తరిమికొట్టారు.
Elephant on Tracks: రైలు పట్టాలపై ఏనుగు: చివరి క్షణంలో స్పందించిన లోకో పైలట్
మనేంద్రగఢ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బెల్గావ్ గ్రామంలో శనివారం రాత్రి గులాబ్ సింగ్ గోండ్ అనే వ్యక్తి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి అడవి ఏనుగు ప్రవేశించి అతనిని, అతని ఆరేళ్ల కుమార్తె షానును తొక్కి చంపినట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) లోక్‌నాథ్ పటేల్ తెలిపారు. ఏనుగు నిర్మాణంలో ఉన్న ఇంటిని ధ్వంసం చేసిందని, స్థానికులు అక్కడికి వచ్చి ఏనుగులను తరిమికొట్టారని అన్నారు. మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు వచ్చిందని, అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారని అన్నారు. 10 ఏనుగుల గుంపు మీ ప్రాంతంలోకి వస్తుందని లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామస్థులను అప్రమత్తం చేయటం జరిగిందని, అయితే చనిపోయిన వారి ఇల్లు అడవిలో ఉన్నందున వారి కుటుంబానికి సమాచారం అందలేదని పటేల్ తెలిపారు.
Man Attacked By Elephant : వెంటాడి మరీ దాడి చేసిన ఏనుగు..వీడియో
ఏనుగు దాడిలో గాయపడిన మృతుల కుటుంబీకులకు తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 25,000 అందించామని, మిగిలిన పరిహారం అవసరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత పంపిణీ చేయబడుతుందని అధికారి తెలిపారు. సుర్గుజా, జష్‌పూర్, కొరియా, బలరామ్‌పూర్, సూరజ్‌పూర్ జిల్లాలతో పాటు బిలాస్‌పూర్ డివిజన్‌లోని కోర్బా, రాయ్‌ఘర్‌లోని ప్రాంతాలతో కూడిన సర్గుజా డివిజన్‌లో ఏళ్ల తరబడి ఏనుగుల వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏనుగుల దాడితో అనేక మంది ప్రాణాలుసైతం కోల్పోయారు. ఆస్తి నష్టానికి ఏనుగులు కారణమవుతున్నాయి.
