Man Attacked By Elephant : వెంటాడి మరీ దాడి చేసిన ఏనుగు..వీడియో

అసోంలోని ధుబ్రి జిల్లాలో ఓ అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. తమర్‌హాట్‌ ఏరియాలోని ఓ గ్రామాంలోకి వచ్చిన ఏనుగు...స్థానికులపై ప్రతాపం చూపింది. దీనికి సంబంధించిన విజువల్స్

Man Attacked By Elephant : వెంటాడి మరీ దాడి చేసిన ఏనుగు..వీడియో

Elephant

Man Attacked By Elephant : అసోంలోని ధుబ్రి జిల్లాలో ఓ అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. తమర్‌హాట్‌ ఏరియాలోని ఓ గ్రామాంలోకి వచ్చిన ఏనుగు…స్థానికులపై ప్రతాపం చూపింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

శనివారం(డిసెంబర్-18,2021) తమర్‌హాట్‌ ప్రాంతంలో జనవాసాల్లోకి వచ్చిన ఓ అడవి ఏనుగును చూసి భయాందోళనతో స్థానికులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో 30 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి కింద పడిపోయాడు. అతడిని సమీపించిన ఏనుగు తొండంతో ఈడ్చిపడేసింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న కొంత మంది ఏనుగును తరిమేందుకు అరిచినా ఫలితం లేకపకోయింది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. అక్కడి నుంచి ఏనుగు వెళ్లిపోయిన తర్వాత యువకుడిని స్థానికులు హాస్పిటల్ లో చేర్చారు. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అటవీశాఖ అధికారి వెల్లడించారు.

ALSO READ Hema Malini : రోడ్లను తన బుగ్గలతో పోల్చడంపై స్పందించిన హేమామాలిని