Hema Malini : రోడ్లను తన బుగ్గలతో పోల్చడంపై స్పందించిన హేమామాలిని

తన నియోజకవర్గంలోని రోడ్డు అలనాటి న‌టి, బీజేపీ ఎంపీ హేమ‌మాలిని బుగ్గ‌ల్లా ఉన్నాయంటూ శివసేన నేత,మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావ్‌ పాటిల్‌ చేసిన

Hema Malini : రోడ్లను తన బుగ్గలతో పోల్చడంపై స్పందించిన హేమామాలిని

Hemamalini

Hema Malini :  తన నియోజకవర్గంలోని రోడ్డు అలనాటి న‌టి, బీజేపీ ఎంపీ హేమ‌మాలిని బుగ్గ‌ల్లా ఉన్నాయంటూ శివసేన నేత,మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావ్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జల్గావ్‌ జిల్లాలోని బోద్వాడ్‌ నగర్‌లో ఆదివారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ర్యాలీలో గులాబ్‌రావ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా జలగావ్ నియోజకర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నబీజేపీ నేత ఏక్ నాథ్ ఖడ్సే నా నియోజకవర్గానికి వచ్చి ఇక్కడి రోడ్లు చూడాలి. నా నియోజకవర్గంలోని రోడ్లు హేమామాలిని బుగ్గల్లా గనుక లేకుంటే నేను రాజీనామా చేస్తా” అని అన్నారు.

పాటిల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ చకాంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై క్షమాపణలు చెప్పకపోతే.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అయితే.. మహిళా కమిషన్ హెచ్చరించిన కొన్నిగంటల తర్వాత పాటిల్ క్షమాపణలు చెప్పారు. తాను ను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదని..తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.

తన నియోజకవర్గం ధరంగావ్‌లోని రోడ్లు హేమామాలిని బుగ్గల్లా ఉంటాయంటూ మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇవాళ హేమ‌మాలిని స్పందించారు. తన బుగ్గలను భద్రంగా ఉంచుకోవాలేమో అని నవ్వుతూ..రోడ్ల‌ను నటీమ‌ణుల బుగ్గ‌ల‌తో పోల్చే సాంప్ర‌దాయాన్ని చాలా ఏళ్ల క్రితం ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూప్ర‌సాద్ యాద‌వ్ మొద‌లుపెట్టార‌ని,ఇప్పుడు అదే సాంప్ర‌దాయాన్ని అంద‌రూ అనుస‌రిస్తున్నార‌ని హేమామాలిని అన్నారు. అలాంటి కామెంట్స్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

సాధార‌ణ ప్ర‌జ‌లు ఇలాంటి కామెంట్‌లు ఇలాంటి కామెంట్లు చేస్తే పెద్ద‌గా త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని, కానీ గౌర‌వ హోదాల్లో ఉన్న‌వాళ్లు, ప్ర‌జాప్ర‌తినిధులు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం క‌రెక్టు కాద‌ని అన్నారు. మీ బుగ్గ‌ల‌పై కామెంట్ చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్ష‌మాప‌ణ కోరుతారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. తాను ఆ వ్యాఖ్య‌లను ప‌ట్టించుకోన‌ని హేమ‌మాలిని స్ప‌ష్టం చేశారు.

తాజా వ్యవహారంపై శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ స్పందించారు. తమ పార్టీ నేత వ్యాఖ్యలను తప్పుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు గతంలోనూ విన్నామన్నారు. ఈ వ్యాఖ్యలు.. హేమా మాలిని గౌరవిస్తున్నట్టు. అంతే కానీ నెగిటివ్​గా ఆలోచించవద్దన్నారు. తమకు హేమా మాలిని అంటే గౌరవం ఉందన్నారు.

కాగా,ఇటీవల ఓ రాజస్తాన్ మంత్రి కూడా రోడ్లను కత్రినా కైఫ్ బుగ్గలతో పోల్చిన విషయం తెలిసిందే.

ALSO READ Vijay Devarakonda – Rashmika : ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్న విజయ్-రష్మిక