Khalistani terrorist : భారత పార్లమెంటును పేల్చివేస్తాం… ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజా హెచ్చరిక
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. తనను చంపేందుకు పన్నిన కుట్ర విఫలమైన తర్వాత డిసెంబర్ 13వతేదీ లేదా అంతకంటే ముందు భారత పార్లమెంటుపై దాడి చేస్తానని పన్నూన్ ప్రకటించారు....
- saleem sk
- Published On : December 6, 2023 / 10:49 AM IST
Pannun fresh threat
Khalistani terrorist : ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. తనను చంపేందుకు పన్నిన కుట్ర విఫలమైన తర్వాత డిసెంబర్ 13వతేదీ లేదా అంతకంటే ముందు భారత పార్లమెంటుపై దాడి చేస్తానని పన్నూన్ ప్రకటించారు. ఈ మేరకు వీడియోను విడుదల చేశాడు. భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపు వీడియో వచ్చింది.
ALSO READ : Ravindra Jadeja : రవీంద్ర జడేజా, రివాబాల ప్రేమ కథ…డేటింగ్
‘‘ఢిల్లీ బనేగా ఖలిస్తాన్’’ అనే శీర్షికతో 2001 పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్ ఉన్న వీడియోలో పన్నూన్ మాట్లాడారు. తనను చంపడానికి చేసిన కుట్ర విఫలమైనందున, డిసెంబర్ 13వతేదీ లేదా అంతకంటే ముందు పార్లమెంటుపై దాడి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తానని హెచ్చరించాడు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన పన్నూన్ సిక్స్ ఫర్ జస్టిస్ అనే నిషేధిత సంస్థకు అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.
ALSO READ : Virat Kohli : అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు విరాట్ కోహ్లీ, అమితాబ్…8వేలమంది ప్రముఖులకు ఆహ్వానం
సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నినట్లు అభియోగాలు నమోదైన కేసులో అమెరికా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నది. నవంబరు 19వతేదీన ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సిక్కు ప్రజలను హెచ్చరించి గతంలో సంచలనం రేపారు. పన్నూన్ గతంలోనూ పలు సార్లు హెచ్చరికలు చేశాడు. 2020 వసంవత్సరంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పన్నూన్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. రెండు నెలల తర్వాత పన్నూన్ ఆస్తులను అటాచ్‌మెంట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
