Ravindra Jadeja : రవీంద్ర జడేజా, రివాబా ప్రేమ కథ గురించి తెలుసా?

ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బుధవారం తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 35 ఏళ్ల వయస్సులో కూడా జడేజా భారతదేశంలోని ఫిట్టెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. రవీంద్ర జడేజా, రివాబాలది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. జడేజా రివాబాను ఎలా కలిశారు? ప్రేమ, డేటింగ్, పెళ్లి గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి....

Ravindra Jadeja : రవీంద్ర జడేజా, రివాబా ప్రేమ కథ గురించి తెలుసా?

Ravindra Jadeja,Rivaba Love Story

Ravindra Jadeja : ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బుధవారం తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 35 ఏళ్ల వయస్సులో కూడా జడేజా భారతదేశంలోని ఫిటెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. రవీంద్ర జడేజా, రివాబాలది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్.  రివాబాను జడేజా ఎలా కలిశారు? ప్రేమ, డేటింగ్, పెళ్లి గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి.

ALSO READ :  సల్మాన్ ఖాన్‌తో కలిసి మమతా బెనర్జీ స్టెప్పులు .. దీదీ డ్యాన్స్‌కు ప్రముఖులు ఫిదా

2015వ సంవత్సరంలో జడేజాకు అతడి కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని భావించారు. అతడు మాత్రం మరికొంత సమయం తీసుకోవాలనుకున్నారు. అలాంటి సమయంలో రవీంద్ర జడేజా సోదరి నైనా రంగంలోకి దిగి సోదరుడి వివాహ బాధ్యతలను స్వీకరించింది. రివాబా.. రవీంద్ర జడేజా సోదరి నైనాకు సన్నిహిత స్నేహితురాలు. నైనా తన సోదరుడు రవీంద్రను ఓ పార్టీకి తీసుకువెళ్లి స్నేహితురాలైన రివాబాతో అనధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Ravindra Jadeja,Rivaba

Ravindra Jadeja,Rivaba

ALSO READ : Michaung cyclone : మిగ్ జామ్ తుపాన్‌పై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్

మొదటిసారి కలిశాక రవీంద్ర, రివాబాలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమ కథకు సోదరి నైనానే బీజం వేశారు. రవీంద్ర, రివాబాల మధ్య ప్రేమ చిగురించడంతో ఒకరితో ఒకరు మూడు నెలల పాటు డేటింగ్ చేశారు. తాము జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నాక 2016వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం పెద్దల ఆశీర్వాదంతో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.

ALSO READ : Cyclone Michaung : తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు

రవీంద్ర జడేజా తన భార్య రివాబాను గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపారు. బీజేపీ పక్షాన రివాబా విజయం సాధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. జడేజా టీమిండియా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ముఖ్యమైన మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు రివాబా ఎప్పుడూ స్టేడియంలో కనిపిస్తుంటారు. క్రికెట్ గ్రౌండ్‌లో భర్త రవీంద్రకు రివాబా అతిపెద్ద అభిమానిగా నిలిచారు. రవీంద్ర జడేజా బుధవారం 35 జన్మదినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ జంటకు మనమూ అభినందనలు చెబుదాం.