Punjab: జైళ్లలో డ్రగ్స్‭పై తీవ్ర ఆరోపణలు.. రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సిద్ధూ ఛాలెంజ్

1988 నాటి ఒక రోడ్డు ప్రమాదం కేసులో 10 నెలల జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు సిద్ధూ. ఆ ప్రమాదంలో గుర్నామ్ సింగ్ అన వ్యక్తి మరణించారు. వాస్తవానికి జైలు శిక్ష మరింత ఎక్కువ కాలం ఉండేంది.

పంజాబ్ రాష్ట్రంలోని జైల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై అవుతున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. ఒకవేళ తన ఆరోపణలు అవస్తవమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పకుంటానని ఛాలెంజ్ విసిరారు. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ‘‘లా అండ్ ఆర్డర్, డ్రగ్ మాఫియా, జైల్.. ఈ మూడు విషయాల్లో పంజాబ్ దారుణ పరిస్థితిలో ఉంది. దీనిపై మీద వారంలో పాలసీ రూపొందించాలని హైకోర్టు చెప్పింది. జైల్ మంత్రిగా సీఎం భగవంత్ మాన్ ఉన్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నారు? జైలు లోపలే డ్రగ్స్ అమ్ముతున్నారు. ఇది అబద్ధమని నిరూపించండి, రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని సిద్ధూ అన్నారు.

1988 నాటి ఒక రోడ్డు ప్రమాదం కేసులో 10 నెలల జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు సిద్ధూ. ఆ ప్రమాదంలో గుర్నామ్ సింగ్ అన వ్యక్తి మరణించారు. వాస్తవానికి జైలు శిక్ష మరింత ఎక్కువ కాలం ఉండేంది. కానీ సత్ ప్రకవర్తన కారణంగా కాస్త ముందుగానే సిద్ధూను విడుదల చేశారు. ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా గురించి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోను రిపోర్టు ఇవ్వమని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆదేశించిన తర్వాత సిద్ధూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ (శాంతి భద్రతలు) పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని సిద్ధూ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పంజాబ్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.

ట్రెండింగ్ వార్తలు