×
Ad

Women C J in India : సుప్రీంకోర్టుకు త్వరలోనే తొలి మహిళా చీఫ్ జస్టిస్ : జస్టిస్ నారిమన్

  • Published On : April 17, 2021 / 11:36 AM IST

Women C J In India

Women CJ in India in Future  : ఎంతటి ప్రతిభా పాటవాలు ఉన్నా పురుషులతో సమానంగా సత్తా చాటుతున్నా..మహిళలనే ఒకే ఒక్క కారణంతో కొన్ని స్థానాల్లో ఇంకా మహిళలకు ప్రాతినిధ్యం దక్కటంలేదు అనేది అక్షర సత్యం. అటువంటిదే దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిగ్ స్థానం ఇప్పటి వరకూ ఒక్క మహిళకు దక్కలేదు. ఆ కొరత అలాగే ఉండిపోయింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఎనిమిది మంది మహిళలు సేవలందించారు. 2014 తరువాత కేవలం ముగ్గురికే ఈ అవకాశం లభించింది. కానీ చీఫ్ జస్టిస్ స్థానం ఒక్క మహిళకు దక్కలేదు.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలోనే ఆ కొరత కూడా తీరనున్నట్లుగా తెలుస్తోంది. జస్టిస్ సునందా భండారా ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సమీప భవిష్యత్తులోనే భారతావని తొలి మహిళా చీఫ్ జస్టిస్ ను చూడబోతోందని అనటం ఆహ్వానించదగిన విషయం. స్వతంత్ర భారతావనిలో ఇంతవరకూ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కలేదు. అయితే..ఓ మహిళకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి బాధ్యతలు లభించడానికి మరెంతో కాలం పట్టబోదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కాగా..రెండు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, వివిధ హైకోర్టులకు అడ్ హాక్ జడ్జీలను నియమిస్తూ, మనకు మంచి అభ్యర్థులు వచ్చినప్పుడే టాప్ పోస్టుకు ఓ మహిళ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే జస్టిస్ నారిమన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన విషయం. ఇప్పటివరకూ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఎనిమిది మంది మహిళలు సేవలందించారు. 2014 తరువాత కేవలం ముగ్గురికే ఈ అవకాశం లభించింది.

వచ్చే వారంలో అంటే ఫిబ్రవరి 23న చీఫ్ జస్టిస్ బోబ్డే పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో ఎన్వీ రమణ సీజేగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే. వచ్చే శనివారం నుంచి 2022 ఆగస్టు 26 వరకూ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆ తరువాత మాత్రం ఓ మహిళకు సీజేగా బాధ్యతలు అందే అవకాశాలు ఉన్నాయని నారిమన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ బీవీ నాగరత్నకు ఈ అవకాశం లభిస్తుందని..గత వారంలో జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం ఆమెను ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.