టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సొనాలీ ఫొగత్ కు బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనాలీని ఓ ఇంగ్లీష్ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా సోనాలీ మాట్లాడుతూ..ఎమ్మెల్యేగా తాను గెలిస్తే..టిక్ టాక్ ను దేశభక్తి కోసం వాడతానని ప్రముఖ నటి, బీజేపీ అభ్యర్థి సొనాలీ ఫొగత్ ప్రకటించారు. అంతేకాదు..తాను ఎమ్మెల్యే అయ్యాక తన నియోజకవర్గానికి సంబంధించిన పనులను ప్రచారం చేసేందుకు టిక్ టాక్ ను వాడుకుంటానని తెలిపారు. టిక్‌టాక్‌లో ఫేమస్ అయినందుకు మాత్రమే తనకు బీజేపీ టిక్కెట్ రాలేదు. 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో కష్టపడి పనిచేశానని అందుకే పార్టీ లనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిందని సోనాలీ ఫోగత్ తెలిపారు.
పార్టీకి సంస్థ ‘గిరిజన మోర్చా’లో పనిచేస్తూ..గిరిజనులకు సేవ చేస్తున్నానని తెలిపారు. సీరియల్స్, సినిమాల్లో కూడా నటిస్తూ, టిక్‌టాక్‌లో యాక్టివ్‌గా ఉన్నానని అన్నారు. బీజేపీ హర్యాణా అసెంబ్లీ ఎన్నికల్లో జాట్‌లు అధికంగా ఉండే అదమ్‌పూర్ నుంచి ప్రముఖ హీరోయిన్ సొనాలీ ఫొగత్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కామెడీ ఓరియంటెడ్ వీడియోలతో టిక్‌టాక్‌లో చేస్తూ సొనాలీ ఫొగత్ ఫేమస్ అయ్యారు.