Corporate Job Crisis : వయస్సు 40 దాటితే ఉద్యోగం ఊడినట్లేనా? ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ విషయంలో కొత్త చర్చ.. వాళ్లే ఎందుకు టార్గెట్‌?

Corporate Job Crisis : ఈసారి ఒరాకిల్‌ చేపట్టిన లేఆఫ్స్‌లో అత్యధికంగా 40ఏళ్లకు పైన వారే ఉన్నారని తెలుస్తోంది. ఇందులో దాదాపు 16శాతం మంది ఉద్యోగులు.. 60ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు వారేనట. AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్న ఒరాకిల్.. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు, మేనేజర్లు, డేటా సెంటర్ సపోర్ట్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగిస్తోంది. దీంతో ఇప్పుడు 40ప్లస్ ఏజ్‌ను లేఆఫ్‌కు ప్రామాణికంగా కంపెనీలు చూస్తున్నాయా అనే చర్చ జరుగుతోంది.

Corporate Job Crisis

Corporate Job Crisis : సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో లేఆఫ్‌ల భయం వెంటాడుతోంది. ముఖ్యంగా వయసు 40దాటితే ఉద్యోగం ఊడటం ఖాయమన్న చర్చ మార్కెట్‌లో జోరుగా సాగుతోంది. ఇటీవల ఒరాకిల్, అడిడాస్‌లాంటి మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు జరగగా.. 45ఏళ్ల వయసును లేఆఫ్‌కు నిర్ణీత వయసుగా ఆ కంపెనీలు పెట్టుకున్నాయా అనే వాదన వినిపిస్తోంది.

Also Read : Balapur Ganesh Laddu Auction 2026 : బాలాపూర్ లడ్డూ వేలంలో సరికొత్త రికార్డు నమోదు.. ఏ సంవత్సరం ఎంత ధర పలికిందంటే?

ఒరాకిల్‌ ఇండియాలోని కొన్ని టీమ్స్‌లో ఉద్యోగాల కోత జరిగింది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్న సంస్థ.. గ్లోబల్ ఉద్యోగుల సంఖ్యను 1.62 లక్షల నుంచి 1.41 లక్షలకు తగ్గించుకుందని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక అడిడాస్‌లోనూ టెక్నాలజీ విభాగం పునర్‌ వ్యవస్థీకరణ వార్తలు వచ్చాయి. గురుగ్రామ్‌లోని టెక్ హబ్‌లో దాదాపు 50శాతం ఉద్యోగాలు ప్రభావితమవుతాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్ల లాంటి ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.

ఈసారి ఒరాకిల్‌ చేపట్టిన లేఆఫ్స్‌లో అత్యధికంగా 40ఏళ్లకు పైన వారే ఉన్నారని తెలుస్తోంది. ఇందులో దాదాపు 16శాతం మంది ఉద్యోగులు.. 60ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు వారేనట. AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్న ఒరాకిల్.. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు, మేనేజర్లు, డేటా సెంటర్ సపోర్ట్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగిస్తోంది. దీంతో ఇప్పుడు 40ప్లస్ ఏజ్‌ను లేఆఫ్‌కు ప్రామాణికంగా కంపెనీలు చూస్తున్నాయా అనే చర్చ జరుగుతోంది.

నిజానికి లేఆఫ్‌ను కేవలం వయసు, పనితీరు లేదా అనుభవంతోనే వివరించలేం. అయితే, ఒక ఉద్యోగి 40 ఏళ్లకు చేరుకునే సమయానికి అతనికి 15 లేదా 20 ఏళ్ల అనుభవం ఉండొచ్చు. సీనియర్ హోదా ఉండొచ్చు. దానికి తగ్గట్టే జీతం కూడా ఎక్కువగా ఉండొచ్చు. కానీ కంపెనీ ఖర్చులు తగ్గించుకునే సమయంలో అదే సీనియారిటీ ఒక అంశంగా మారే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించడం, రెండు టీమ్‌లను ఒకటిగా చేయడం, తక్కువ మందితో ఎక్కువ పని చేయించడం, కొన్ని పనులను ఏఐ లేదంటే ఆటోమేషన్‌కు అప్పగించడం లాంటి మార్పులు ఉద్యోగాలపై ప్రభావం చూపవచ్చనేది మరికొందరి వాదన.

అయితే, 45ఏళ్లు వచ్చిన వెంటనే కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని కాదు. 45 ఏళ్లను లేఆఫ్ వయసుగా కంపెనీలు నిర్ణయించుకున్నాయనే ఆధారాలు ఇప్పటివరకు లేవు. అసలు సమస్య వేరేచోట ఉంది. వయసు, సీనియారిటీ, జీతం, ప్రస్తుత నైపుణ్యాలు, కంపెనీకి మారుతున్న అవసరాలు.. ఇవన్నీ ఒకే సమయంలో కెరీర్‌లో 40ఏళ్ల దశలో ఎదురవుతున్నాయి‌. అసలు మార్పు వయసు కంటే.. వ్యాపార విధానాలు, AI, ఆటోమేషన్, పునర్ వ్యవస్థీకరణలో కనిపిస్తోంది.

అనుభవం ఇప్పటికీ విలువైనదే. అయితే, మారుతున్న ఉద్యోగ మార్కెట్‌లో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగడం మరింత అవసరంగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి‌. గతంలో ఉద్యోగ భద్రత అంటే.. ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయడం. ఇప్పుడు అర్థం మారుతోంది. తన స్కిల్స్‌కు మార్కెట్లో డిమాండ్ ఉండేలా చూసుకోవడమే కొత్త ఉద్యోగ భద్రత అని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకప్పుడు కార్పొరేట్‌ ఉద్యోగంలో 15 నుంచి 20ఏళ్ల అనుభవం అంటే.. అది పెద్ద ప్లస్‌ పాయింట్‌. సంస్థలో ఎన్నో మార్పులను చూసిన ఉద్యోగి.. సమస్యలను వేగంగా సాల్వ్ చేస్తాడని, టీమ్‌ను సమర్థంగా నడిపించగలడని కంపెనీలు భావించేవి. ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న ఉద్యోగుల్లో . ఉద్యోగ భద్రతపై ఆందోళన పెరుగుతోంది. అయితే, దీన్ని వయసు పెరిగిన ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నట్లు కాదు.. కంపెనీలకు అవసరమైన నైపుణ్యాల స్వరూపం మారుతున్నట్లుగానే దీన్ని చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ ఏడాది కొత్త టెక్నాలజీ, స్కిల్‌ నేర్చుకోవాలి. తమ రంగంలో ఏ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోందో గమనించాలి. మేనేజ్‌మెంట్‌తో పాటు అవసరమైన టెక్నికల్‌ స్కిల్స్‌ను కూడా అప్‌డేట్‌ చేసుకోవాలి చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 299 టెక్నాలజీ కంపెనీల్లో లక్షా 28వేల 536 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2025 మొత్తం నమోదైన 278 కంపెనీల్లోని లక్షా 22వేల 606 టెక్ ఉద్యోగాల కోతలను ఈ సంఖ్య ఇప్పటికే దాటింది. వోక్స్‌వ్యాగన్‌లో లక్ష, ఒరాకిల్‌లో మొత్తం 30వేల 441, అమెజాన్‌లో 17వేల 379, మైక్రోసాఫ్ట్‌లో 13వేల 700, ఇంటెల్‌లో 15వేలు, కాగ్నిజెంట్‌లో 15వేలు, మెటాలో 16వేలు, డెల్‌లో 11వేలు, యాక్సెంచర్‌లో 11వేల ఉద్యోగాలకు కోత పడింది. మోటో కంపెనీల్లోనూ లేఆఫ్స్‌ జరగడం కొత్త టెన్షన్స్‌ క్రియేట్ చేస్తోంది.

కంపెనీలు ఏఐతో ఉత్పాదకతను పెంచాలని చూస్తున్నాయి. అదే సమయంలో డేటా, ఆటోమేషన్‌లాంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. అయితే, ప్రతి కంపెనీలో ఉద్యోగాల కోతకు ఒకే కారణం లేదు. కొన్ని సంస్థలు ఖర్చులు తగ్గిస్తున్నాయి‌. కొన్ని సంస్థలు తమ టీమ్‌లను పునర్‌ వ్యవస్థీకరిస్తున్నాయి‌. మరికొన్ని వ్యాపార ప్రాధాన్యతలను మార్చుకుంటున్నాయి. ఇంకొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.