With 414 New Covid 19 Cases Delhi Records Lowest
Covid-19 Cases: ఢిల్లీలో శనివారం మార్చి 15 తర్వాత అత్యంత తక్కువగా 414 కొవిడ్-19 కేసులు మాత్రమే నమోదైయ్యాయి. గడిచిన 24గంటల్లో నమోదైన కేసులతో కలిపి ఢిల్లీలో యాక్టివ్ కేసులు 6వేల 731 మాత్రమే ఉన్నాయి. పాజిటివిటీ రేటు 0.53శాతం తగ్గిపోయింది. మార్చి 15న నమోదైన 368కేసుల తర్వాత శనివారమే తక్కువగా నమోదైయ్యాయి.
ఇప్పటి వరకూ ఢిల్లీలో 14లక్షల 28వేల 863 కొవిడ్ కేసులు రిజిష్టర్ అయ్యాయి. గడిచిన 24గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా 60మృతులు సంభవించాయి. దీంతో మొత్తం మృతులు 24వేల 557కు చేరినట్లు రికార్డులు చెప్తున్నాయి.
కరోనా వైరస్ నిర్ధారణ కోసం శుక్రవారం నుంచి శనివారం వరకూ 77వేల 694 శాంపుల్స్‌తో వాటిల్లో 22వేల 59 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు, 55వేల 635 ఆర్టీ పీసీఆర్ టెస్టులు. ఇప్పటివరకూ కోటి 96లక్షల 81వేల 458 శాంపుల్స్ తో కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో 1683మంది పేషెంట్లు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు.