దేశమంతా లాక్‌డౌన్ విధించిన గానీ పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అత్యవసర పనులైతే వదిలేస్తున్నారు. లేకపోతే వాహనాలను సీజ్ చేసి.. కేసులు నమోదు చేస్తున్నారు. అలా.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఓ మహిళ కారును ఆపారని నడిరోడ్డు మీద పోలీసులపై గట్టిగట్టిగా అరుస్తూ పెద్ద గొడవ చేసింది. గొడవతో ఆగకుండా.. ఓ పోలీస్ డ్రెస్‌కి రక్తాన్ని అంటించింది.
అసలు విషయమేంటంటే.. రోడ్డు మీద క్యాబ్ వస్తుండడంతో చూసి పోలీసులు ఆపేశారు. బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించి.. డ్రైవర్‌ను దింప్పారు. ఇంతలో కారులో కూర్చున్న మహిళ బయటకు వచ్చి పోలీసులతో గొడవకు దిగింది. దానితో ఆగకుండా కోపంతో ఏం చేయాలో అర్ధంకాక ఆమెకు నుధిటిపై పాత దెబ్బ ఉంటే దాన్ని గిళ్లి రక్తం వస్తుంటే వెళ్లి పోలీస్ డ్రస్‌కు పూసింది.
దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగే సమయంలో పక్కనే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Terrible behavior by this person. #Police r under tremendous pressure trying to make #21daylockdown work.
Lets accpt some inconveniencs n not gripe on day 1 itself??
Loutish behavior doesnt help our collective fight against #CoronaVirus #StayHome
— Rajeev Chandrasekhar ?? (@rajeev_mp) March 25, 2020
See Also | కరోనా నియంత్రణకు రూ.2కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్