Camel Attack On women
Camel Attack On women : ఓ మహిళకు పెంపుడు జంతువే యమపాశమైంది. ఆహారం పెట్టి పోషించిన జంతువే యజమానిని దారుణంగా చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ లో చోటుచేసుకుంది. తోతా దేవి అనే మహిళ కుటుంబం ఒంటెని పెంచుకుంటోంది. ప్రేమగా పెంచుకున్న ఒంటె నీరు పెట్టటానికి వెళ్లిన యజమాని నోట కరిచి చంపింది. పెంపుడు జంతువు ఒంటెకు నీరు పెట్టటానికి వెళ్లిన తోతాదేవిపై పెంపుడు ఒంటె దాడికి తెగబడింది. అకస్మాత్తుగా ఒంటె ఆమె గొంతును నోటకరిచి గట్టిగా నొక్కేయడంతో ఆమె ఊపిరాడక మరణించింది.
తోతా దేవి..ఆమె భర్త పప్పూ బఘేల్‌తో బస్గోయ్ గ్రామంలో నివసిస్తుంటారు. వారు ఓ ఒంటెను పెంచుకుంటున్నారు. ఆదివారం (జూన్2.2023) ఎప్పటిలాగే ఒంటెకు నీళ్లు పెట్టేందుకు తోతదావి వెళ్లగా ఆ ఒంటెకు ఏమైందో ఏమోగానీ ఆమెపై దాడిచేసింది. తోతాదేవి గొంతును నోట కరిచింది. రెండు దవడలతో గట్టిగా నొక్కిపట్టేసింది. దీంతో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేసింది. ఇరుగు పొరుగువారు ఆమె కేకలకు పరుగెత్తుకుని వచ్చారు.
అప్పటికే ఒంటె నోటిలో తోతాదేవి గొంతు చిక్కుకోవటంతో ఆమె విలవిల్లాడిపోతు కనిపించిది. ఒంటెను అదిలించినా అది పట్టువిడవలేదు. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అలా ప్రేమగా పెంచుకున్న ఒంటె నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయింది యజమాని తోతాదేవి.