died
Patanjali Gurukul: ఉత్తరాఖాండ్‌లోని హరిద్వార్ లో అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలో ఉన్న పతాంజలి గురుకుల్ లో ఉండే 24ఏళ్ల మహిళ ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు గంటల సమయంలో ఐదో అంతస్తు నుంచి దూకడంతో అక్కడే మృతి చెందింది.
కొద్ది సేపటి తర్వాత గమనించిన స్థానికులు హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చేశారు. ఘటనకు పాల్పడిన చోటు నుంచి సూసైడ్ నోట్ దొరికినట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఆధ్మాత్మికపరమైన ఆలోచనలు, దివ్య శక్తులు గురించి మాత్రమే రాసిందని చెప్పారు.
కానీ, ఆత్మహత్య గురించి అందులో స్పష్టంగా లేదని చెప్పారు అధికారులు. మధ్యప్రదేశ్ లోని మాంద్‌సార్ జిల్లాకు చెందినదిగా గుర్తించారు. మృతదేహానికి ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లు మీడియాకు తెలిపారు.
………………………………………. : మగబిడ్డకు జన్మనిచ్చిన బాలకృష్ణ హీరోయిన్