Varanasi : వీధుల్లో మహిళ నివాసం..ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్!
మానసికంగా స్వాతి..పూర్తిగా ఆరోగ్యంగా ఉందని Sharda Avanish Tripathi వెల్లడించారు. కానీ వీధుల్లో జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
- madhu
- Published On : November 24, 2021 / 07:19 PM IST
Swathi
Woman Living On Street : వీధుల్లో నివాసం ఉంటున్న ఓ మహిళ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై టిఫిన్ చేస్తుండగా..ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. ఇంగ్లీషులో ఆమె మాట్లాడడం ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవాలని అనుకుని…వీడియో తీశాడు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. తాను సైన్స్ గ్రాడ్యుయేట్ అని చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనర్గళంగా మాట్లాడుతున్న ఆమె..తనకు పని ఇప్పించాలని కోరుతోంది. ఈ ఘటన వారణాసిలో చోటు చేసుకుంది.
Read More : Vehicle Tax : పన్నుల మోత.. ఏపీలో వాహనదారులకు బ్యాడ్ న్యూస్
Sharda Avanish Tripathi అనే వ్యక్తి…ఓ దుకాణం ఎదుట కూర్చొని టిఫిన్ చేస్తున్న మహిళపై దృష్టి పడింది. ఆమె పేరు అడగడంతో స్వాతి అని చెప్పింది. ఇంగ్లీషులో చెప్పడంతో ఆమె కూడా అదే భాషలో సమాధానం చెప్పడంతో అతను షాక్ కు గురయ్యాడు. తన జీవితానికి సంబంధించని విషయాలు వెల్లడించింది. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం..శరీరం యొక్క కుడిభాగం..పక్షవాతానికి గురైందని తెలిపింది. తాను దక్షిణ భారతదేశం నుంచి మూడేళ్ల క్రితం…వారణాసికి రావడం జరిగిందని…తాను కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అని చెప్పింది.
Read More : Rajasthan : రోడ్లు కత్రినా బుగ్గల్లా ఉండాలి, నెటిజన్ల ఫైర్..వీడియో వైరల్
మానసికంగా స్వాతి..పూర్తిగా ఆరోగ్యంగా ఉందని Sharda Avanish Tripathi వెల్లడించారు. కానీ వీధుల్లో జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు పునరావాసం లేదని, ఆర్థిక సహాయం అవసరమన్నారు. తన దగ్గరి నుంచి డబ్బు తీసుకోలేదని, ఏదైనా పని ఇప్పించాలని కోరుతోందన్నారు. టైపింగ్, ఇతర కంప్యూటర్ కు సంబంధించిన పనులు చేయగలదన్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వేల సంఖ్యలో నెటిజన్లు వీక్షించారు.
