Vehicle Tax : పన్నుల మోత.. వాహ‌నదారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్

ఏపీలో వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పన్నుల మోత మోగింది. వాహనదారులపై మరింత భారం పడింది.

Vehicle Tax : పన్నుల మోత.. వాహ‌నదారులకు ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్

Vehicle Tax

Vehicle Tax : ఏపీలో వాహనదారులకు ఇది బ్యాడ్ న్యూస్. పన్నుల మోత మోగింది. వాహనదారులపై మరింత భారం పడింది. కొత్త వాహనాలపై లైఫ్‌ ట్యాక్స్‌ పెంచారు. కొత్త వాహనాలకు 1 నుంచి 4 శాతం వరకు లైఫ్ ట్యాక్స్‌ పెంచారు. పాత వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ పెంచుతూ సవరణ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాత వాహనాలకు.. 4 వేల నుంచి 6 వేల వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ పెంచారు. రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులను ఆమోదించింది.

CM Jagan : వారందరికి కొత్త ఇళ్లు.. సీఎం జగన్ శుభవార్త

”కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్, పాత వాహనాల గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ చట్ట సవరణ చేశాము. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అధిక కర్బనాలను విడుదల చేసే వాహనాలను నివారించేందుకు ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టాము” అని మంత్రి పేర్ని నాని తెలిపారు. అందుకే గ్రీన్ ట్యాక్స్ పేరిట పన్నులు పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు.

కొత్త చట్టం ప్రకారం 12ఏళ్ల లోపు కొనుగోలు చేసిన అన్ని రవాణా, రవాణేతర వాహనాలు రూ.4 వేలు ట్యాక్స్ కట్టాలని మంత్రి పేర్ని నాని చెప్పారు. 12 ఏళ్లకు మించితే గ్రీన్ ట్యాక్స్ రూ.6 వేలు కట్టాలన్నారు. మరోవైపు నూతన వాహనాలు కొనుగోలు చేసినప్పుడు కూడా కట్టే ట్యాక్స్ పెంచామని… రూ.20 లక్షలు పైబడిన వాహనాలు కొనుగోలు చేస్తే గతంలో 18 శాతం పన్ను కట్టాల్సి ఉండేదని.. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అదనంగా మరో 4 శాతం పన్ను కట్టాల్సి ఉంటుందన్నారు. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు వాహనాలను కొనుగోలు చేస్తే అదనంగా 3 శాతం పన్ను కట్టాలని… అదే రూ.5 లక్షల లోపు వాహనాలను కొనుగోలు చేస్తే అదనంగా 1శాతం పన్ను కట్టాలని మంత్రి పేర్ని నాని తెలిపారు.

SBI కస్టమర్లకు ముఖ్య గమనిక.. వెంటనే ఆ పని చేయండి

మరోవైపు సినిమాటోగ్రఫీ బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది. దీంతో.. ఇకపై సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే విక్రయించనుంది. రోజుకు 4 షోలు మాత్రమే ప్రదర్శించేందుకు నిబంధనలతో కొత్త చట్టం తెచ్చింది. బెనిఫిట్‌ షోల కట్టడికి చట్టంలో మార్పులు చేసింది.