Rajasthan : రోడ్లు కత్రినా బుగ్గల్లా ఉండాలి, నెటిజన్ల ఫైర్..వీడియో వైరల్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. అందులో 15 మంది కొత్తవారికి కేబినెట్ లో చోటు కల్పించారు. అందులో రాజేంద్ర గూడా కూడా ఉన్నారు.

Rajasthan : రోడ్లు కత్రినా బుగ్గల్లా ఉండాలి, నెటిజన్ల ఫైర్..వీడియో వైరల్

Rajasthan

Updated On : November 24, 2021 / 6:41 PM IST

Katrina Kaif cheeks : కొంతమంది నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లో నిలుస్తున్నారు. తాము ప్రజాప్రతినిధులమనే విషయాన్ని వారు మరిచిపోతున్నట్లు ఉంది. సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నా…పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా..రోడ్లను ఓ మంత్రి.. నటితో పోల్చారు. తన నియోజకవర్గంలో రోడ్లు..ఆ నటి బుగ్గల్లా ఉండాలని వ్యాఖ్యానించడం వివాదాస్పదమతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి..ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా ? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : judge protest : సుప్రీంకోర్టు ముందు జడ్జి అర్థ నగ్న నిరసన..ఎందుకంటే..

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. అందులో 15 మంది కొత్తవారికి కేబినెట్ లో చోటు కల్పించారు. అందులో రాజేంద్ర గూడా కూడా ఉన్నారు. ఈయనకు పంచాయతీ రాజ్ శాఖను కేటాయించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తన నియోజకవర్గమైన పూర్వాటీ పర్యటనకు వెళ్లారు. అక్కడ స్థానికులతో మాట్లాడారు. ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు గ్రామాల్లో ఉన్న రోడ్లను బాగు చేయించాలని కోరారు.

Read More : Rayalacheruvu : చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

తన నియోజకవర్గంలో రహదారులు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ లా ఉండాలని వ్యాఖ్యానించారు. మొదట ఆ నటి పేరును తప్పుగా పలికారు. మంత్రిగారి మాటలకు అక్కడున్న వారు చప్పట్లు కొట్టడం విశేషం. మంత్రిగారి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. సరదాగా వ్యాఖ్యలు చేసినా..ఇలాంటివి సరికాదని సూచిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.