Rayalacheruvu : చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

10TV Telugu News

Rayalacheruvu :  చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తిరుపతి సమీపంలోని రాయలచెరువును పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. అయితే రాయలచెరువుకు వెళ్లొద్దని చంద్రబాబుకు పోలీసుల నోటీసులిచ్చారు. చంద్రబాబు పర్యటనకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు. రాయల చెరువును రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. చంద్రగిరి నుంచి రాయల చెరువుకు చంద్రబాబు బయలుదేరుతుండగా పోలీసులు నోటీసులు ఇచ్చారు.

వందకుపైగా గ్రామాలను, పది వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న రాయలచెరువు వ్యవహారం ఈ స్థితికి చేరడానికి బాధ్యులెవరన్న ప్రశ్న ఇపుడు చర్చనీయాంశమవుతోంది. చెరువు కింద రామచంద్రాపురం మండల పరిధిలో దిగువన సంజీవరాయపురం, ప్రసన్న వెంకటేశ్వరపురం, బలిజపల్లి, గంగమాంబపురం (సంతబైలు), రామిరెడ్డిపురం, గంగిరెడ్డిపల్లి, కమ్మకండ్రిగ, మిట్టూరు, పద్మవల్లిపురం, నడవలూరు, నెన్నూరు, కేకేవీపురం, వెంకట్రామాపురం, గణేశ్వరపురం, సొరకాయలపాలెం, కమ్మపల్లి పంచాయతీలకు చెందిన 112 గ్రామాలున్నాయి.

Also Read : AP Covid Update : ఏపీలో కొత్తగా 264 కోవిడ్ కేసులు

వీటితో పాటు తిరుపతి రూరల్‌ మండలం పరిధిలో కుంట్రపాకం, తనపల్లి, పాడిపేట, ముళ్ళఊడి, తిరుచానూరు తదితర ప్రాంతాలకు కూడా భూగర్భ జలాల పరంగా ప్రయోజనాన్నికలిగిస్తోంది. ఒక వేళ కట్టతెగితే ఊళ్ళకు ఊళ్ళను కొట్టుకుపోయేలా చేసే ప్రమాదాన్ని కలిగించే స్థితిలో రాయల చెరువు ఉంది.

కాగా….రాయల చెరువుకు ప్రమాదాన్ని అధికారులు వెంటనే గుర్తించలేక పోయారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయన తిరుపతి సమీపంలోని రాయల చెరువును సందర్శించారు. చెట్లు అడ్డంగా ఉండడం వల్ల చెరువు నుంచి నీళ్లు రావడం గుర్తించలేదని ఇంజనీర్లు చెప్పడం దారుణమన్నారు. మంత్రులు చెరువు వద్ద కూర్చొని పనులు చేయించాలి…. చెరువుకు ప్రమాదం లేదని ఈ ప్రాంత వాసులకు భరోసా ఇవ్వలేకపోయారని చంద్రబాబు అన్నారు. అధికారుల వైఫల్యం వల్ల ఈ ప్రాంతవాసులు నిద్రలేని రాత్రులు గడిపారు..ముంపు బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాయల చెరువుతో నాకు ఎంతో అనుబంధం ఉంది…సరిగ్గా గుర్తించ లేకపోవడం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది.