UP : కరెంట్ పోల్ ఎక్కి వివాహిత ధర్నా.. భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలట.. వీడియో వైరల్
ఓ మహిళ తన వివాహేతర సంబంధం బట్టబయలు కావడంతో విద్యుత్ స్తంభం ఎక్కింది.
- Thota Vamshi Kumar
- Published On : April 4, 2024 / 04:18 PM IST
Woman wants to live together with husband and boy friend
కారణాలు ఏవైనా కావొచ్చు గానీ, ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ మహిళ తన వివాహేతర సంబంధం బట్టబయలు కావడంతో విద్యుత్ స్తంభం ఎక్కింది. భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి ఉంటానని తెలిపింది. ఇందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే కరెంట్ స్తంభం దిగిరానంటూ మొండిపట్టు పట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
పిప్రాయిచ్ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల మహిళ భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. పొరుగూరికి చెందిన వ్యక్తితో ఆమెకు ఏడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల ఈ విషయం కూలీగా పనిచేస్తున్న భర్తకు తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ప్రియుడు కూడా మనతోనే కలిసి ఉంటాడని, దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భర్తకు చెప్పింది. ఇందుకు సదరు భర్త ఒప్పుకోలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
Viral Video : రైలులో టాయిలెట్ వద్దకు వెళ్లేందుకు.. స్పైడర్‌మ్యాన్ స్టంట్.. వీడియో వైరల్
తాను చెప్పిన విషయానికి భర్త ఒప్పుకోవాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ క్రమంలోనే గ్రామంలోని కరెంట్ పోల్ ఎక్కింది. వెంటనే స్థానికులు విద్యుతు అధికారులకు ఫోన్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వారు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమెకు నచ్చజెప్పి కిందకు తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
मोहब्बत का ऐसा सिला…’, 3 बच्चों की मां को चढ़ा ‘इश्क का बुखार’,
प्रेमी को साथ रखने की बात पर पति से नाराज, खंभे पर चढ़ करने लगी तांडव !!#यूपी के #गोरखपुर से एक हैरान कर देने वाला मामला सामने आया है। यहां तीन बच्चो की माँ को प्यार का खुमार चढ़ा है और प्यार का खुमार भी इस कदर… pic.twitter.com/J6XQ4FMxRh— MANOJ SHARMA LUCKNOW UP?????? (@ManojSh28986262) April 3, 2024
