Viral Video : రైలులో టాయిలెట్ వద్దకు వెళ్లేందుకు.. స్పైడర్‌మ్యాన్ స్టంట్.. వీడియో వైరల్
రద్దీగా ఉండే రైలులో రెస్ట్‌రూమ్(బాత్రూమ్)కి వెళ్లడం అంటే ఎంతో శ్రమతో కూడుకున్న విషయం అన్న సంగతి చాలా మందికి అనుభవమే.

Passenger Spider Man stunt to reach train toilet
మిగిలిన వాటితో పోలిస్తే రైలు ప్రయాణం కాస్త చవక. అందుకనే సామాన్యులు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తుంటారు. దీంతో దాదాపుగా రైళ్లు అన్నీ కూడా రద్దీగానే కనిపిస్తుంటాయి. రద్దీగా ఉండే రైలులో కూర్చోని ప్రయాణించడం దేవుడికి ఎరుక కనీసం నిలుచోవం కూడా కష్టమే. అలాంటి రైలులో రెస్ట్‌రూమ్(బాత్రూమ్)కి వెళ్లడం అంటే ఎంతో శ్రమతో కూడుకున్న విషయం అన్న సంగతి చాలా మందికి అనుభవమే.
రద్దీగా ఉండే రైలులో ఓ ప్రయాణికుడు రెస్ట్‌రూమ్‌కు వెళ్లేందుకు అతడు ఎంచుకున్న మార్గం, అతడు వెళ్లిన విధానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభినవ్ పరిహార్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో కింద మొత్తం జనాలు ఉండడంతో ఓ వ్యక్తి సీట్ల పై నుంచి తోటి ప్రయాణికుల తలల మీదుగా బ్యాలెన్స్ చేసుకుంటూ రెస్ట్‌రూమ్‌కు వెళ్లాడు.
Viral Video: నడిరోడ్డుపై అమ్మాయికి భయానక అనుభవం.. ముగ్గురు యువకులు వెంబడించి..
అతడు వెళ్లిన విధానం స్పైడర్ మ్యాన్‌ను గుర్తుకు తెస్తోంది. కొంతమంది ఈ వీడియోలో హాస్యాన్ని కనుగొన్నప్పటికీ, రద్దీ సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు ఎదుర్కొనే సవాళ్లను ఇది హైలెట్ చేస్తుంది. 2023 జూన్‌లోనూ ఇలాంటి ఫీట్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ఓ వ్యక్తి స్టంట్ చేసి టాయిలెట్‌కు చేరుకోవడం కనిపించింది.
View this post on Instagram