Women Constables Seek Gender Change: ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు లింగమార్పిడి కోసం అనుమతి కోరుతూ డీజీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గోరఖ్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పేరు కూడా ఉంది. కాగా, పోలీసు శాఖలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. అయితే దీనిపై అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఇలాంటి ఒక కేసును రాజ్యాంగ హక్కుగా గతంలో ప్రకటించింది. అయితే ఈ మహిళా కానిస్టేబుళ్లు ఉన్న జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు లేఖ ఇవ్వాలని, కౌన్సెలింగ్ నిర్వహించాలని డీజీ కార్యాలయం కోరింది.
ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లలో ఒకరైన సోనమ్ (పేరు మార్చాము).. గోరఖ్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు గోండా, సీతాపూర్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. డీజీ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చానని సోనమ్ తెలిపింది. తనకు జెండర్ డిస్ఫోరియా ఉందని, ఆ కారణంగానే దరఖాస్తు పెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ విషయమై ఉన్నతాధికారులు తనను పిలిచి అడిగినట్లు తెలిపింది.
అయితే ఈ విషయమై లక్నో ప్రధాన కార్యాలయం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. సానుకూల నిర్ణయం తీసుకోకుంటే లింగమార్పిడి కోసం హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని సదరు కానిస్టుబుళ్లు అంటున్నారు. అయోధ్య నివాసి అయిన సోనమ్ తనకు 2019లో యూపీపీలో ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ఆమె మొదటి పోస్టింగ్ కూడా గోరఖ్‌పూర్‌లోనే. లింగ మార్పు కోసం ఫిబ్రవరి 2023 నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఆమె SSP, ADG, గోరఖ్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. సోనమ్ ప్రకారం, ఆమె చదువుతున్న సమయంలో ఆమె హార్మోన్లు మారడం ప్రారంభించాయి. ఇప్పుడు తాను మగవ్యక్తిలా మారాలనుకుంటున్నానని పేర్కొంది.
ఢిల్లీ డాక్టర్ సలహా
సోనమ్ మొదట ఢిల్లీలోని ఒక పెద్ద డాక్టర్ నుంచి అనేక దశల్లో కౌన్సెలింగ్ పొందినట్లు చెప్పింది. దీని తర్వాత డాక్టర్ ఆమెకు లింగ డిస్ఫోరియా ఉన్నట్లు గుర్తించారట. వైద్యుల నివేదిక ఆధారంగా లింగమార్పిడి కోసం అనుమతి కోరింది. ఆమె అనుమతి వచ్చిన వెంటనే లింగ మార్పు ప్రక్రియను ప్రారంభమవుతుంది.
బైక్ నడపడం, స్కర్ట్ వేసుకోవడం ఇబ్బందిగా అనిపించింది
సోనమ్ బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన మగవ్యక్తిగా తయారైంది. ఆమె తన జుట్టు, దుస్తులను కూడా పురుషుల మాదిరిగానే వేసుకుంటుంది. పల్సర్ బైక్ నడుపుతుంది. ఆమె ప్యాంటు, షర్ట్ వేసుకుని ఆఫీసుకు వస్తుంది. స్కూల్‌కి వెళ్లే సమయంలో స్కర్టులు వేసుకోవడం లేదా ఆడపిల్లలా మరేదైనా చేయడం తనకు చాలా ఇబ్బందిగా అనిపించేదని సోనమ్ చెప్పింది.
United States : దారుణం.. 6 నెలల చిన్నారిని సజీవంగా తినేసిన ఎలుకలు.. పోలీసులు విచారణలో
పాఠశాలలో ఆమె ప్రవర్తన కారణంగా, చాలా మంది ఆమెను అబ్బాయి అని పిలిచేవారట. అయితే ఆ పిలుపు తనకు నచ్చేదని అంటోంది సోనమ్. సోనమ్ ప్రకారం.. మొదటి నుంచి తనను తాను అమ్మాయిగా అంగీకరించలేదు. స్కూల్లో స్పోర్ట్స్ ఉన్నప్పుడు, ఆమె తరగతిలో చదువుతున్న అమ్మాయిలు ఆమెను ఖో-ఖో లేదా ఇతర అమ్మాయిలతో ఆటలు ఆడమని అడిగేవారట. కానీ ఆమె అమ్మాయిలతో ఆడటానికి ఇష్టపడేది కాద.
హైకోర్టు తీర్పుపై ఆశలు- తాను కూడా కోర్టుకు వెళ్తానంటోంది
తనలాగే గోండాకు చెందిన మహిళా కానిస్టేబుల్ కూడా లింగమార్పిడి కోసం హైకోర్టులో దరఖాస్తు చేశారని సోనమ్ తెలిపింది. ఆమె పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు సెక్స్ మార్పు రాజ్యాంగ హక్కు అని పేర్కొంది. ఆధునిక సమాజంలో ఒక వ్యక్తి తన గుర్తింపును మార్చుకునే హక్కును మనం తిరస్కరించినా లేదా అంగీకరించకపోయినా, తాము జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ సిండ్రోమ్‌ను మాత్రమే ప్రోత్సహిస్తామని అంటోంది. మహిళా కానిస్టేబుల్ దరఖాస్తును పరిష్కరించాలని యూపీ డీజీపీని ఒక సందర్భంలో హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు తనకు కూడా న్యాయం జరుగుతుందని సోనమ్ భావిస్తోంది.