Women CRPF Personnel : సోనియా,ప్రియాంక భద్రతకు సీఆర్​పీఎఫ్ మహిళా కమాండోలు

వీవీఐపీలకు భద్రత కోసం సీఆర్​పీఎఫ్​లో మహిళా కమాండో సేవలు మొదలుకానున్నాయి.

Gandhi Family

Women CRPF Personnel :  వీవీఐపీలకు భద్రత కోసం సీఆర్​పీఎఫ్​లో మహిళా కమాండో సేవలు మొదలుకానున్నాయి. Z ప్లస్ రక్షణలో ఉన్న వీఐపీ మహిళా నేతల రక్షణలో మహిళా కమాండోల సేవలను సీఆర్​పీఎఫ్​ వినియోగించనుంది. వీఐపీల భద్రత కోసం 32 మంది మహిళా కమాండోలతో ఒక దళాన్ని సీఆర్​పీఎఫ్​ ఏర్పాటు చేయగా..ఇటీవలే మహిళా కమాండోలు 10 వారాల శిక్షణను పూర్తి చేసుకున్నారు.

అయితే జనవరి 2వ వారం నుంచి.. సోనియా, ప్రియాంక‌, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య గ‌రుశ‌ర‌ణ్ కౌర్‌ భద్రతలో సీఆర్పీఎఫ్ మ‌హిళా కమాండోలు చేరునున్నట్లు స‌మాచారం. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భ‌ద్ర‌త‌ను రెండేండ్ల క్రితం కేంద్రం తొల‌గించిన విష‌యం తెలిసిందే. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల‌కు స్పీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌తో Z ప్ల‌స్ కేట‌గిరి కింద ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నారు. అయితే ప్ర‌త్యేకంగా సోనియా, ప్రియాంక‌, గ‌రుశ‌ర‌ణ్ కౌర్‌కు సీఆర్పీఎఫ్ మ‌హిళా సెక్యూరిటీ క‌ల్పించనున్న‌ట్లు స‌మాచారం. ఈ వీఐపీల నివాసాల వద్ద భద్రత, అసెంబ్లీ ఎన్నికల జరిగే రాష్ట్రాలలో వారి పర్యటనల సందర్భంగా మహిళా కమాండోల సేవలను సీఆర్​పీఎఫ్​ వినియోగించనుంది.

ప్రస్తుతం సీఆర్​పీఎఫ్…12మంది వీఐపీలకు Z ప్లస్​ రక్షణ కల్పిస్తుండగా,22మంది వీఐపీలకు Z కేటగిరీ రక్షణ కల్పిస్తోంది.

ALSO READ Omicron Victim : రాజన్న సిరిసిల్ల ఒమిక్రాన్ బాధితుడి కుటుంబానికి కరోనా పాజిటివ్