Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం లాంఛనమే.. అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలుసా?

బిల్లు ఆమోదం అయితే పొందుతుంది కానీ, ఇది ఇప్పట్లో అమలులోకి వచ్చేలా కనిపించడం లేదు. అంటే, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమలు కాకపోవచ్చని తెలుస్తోంది. కారణం, ఇందులో ప్రభుత్వం రెండు విషయాల్ని ప్రధానంగా ప్రస్తావించింది

Women Reservation in 2024 Elections: కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ మంగళవారం లోక్‭సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టారు. పరిస్థితులు చూస్తుంటే ఈ బిల్లు ఆమోదం పొందడం పెద్ద విషయమేమీ కాదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి మెజారిటీకి పైగా ఎంపీలు ఉండగా.. విపక్షాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. అయితే బీఎస్పీ, ఆర్జేడీ లాంటి కొన్ని పార్టీలు కొన్ని అభ్యంతరాలు తెలిపినప్పటికీ మొత్తానికైతే ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. దీంతో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తోన్న మహిళా రిజర్వేషన్ బిల్లు తొందరలోనే ఆమోదం పొందుతుందని తెలుస్తోంది.

Mayawati: కోటాలో కోటా ఉండాల్సిందే.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై భారీ డిమాండ్ చేసిన మాయావతి

బిల్లు ఆమోదం అయితే పొందుతుంది కానీ, ఇది ఇప్పట్లో అమలులోకి వచ్చేలా కనిపించడం లేదు. అంటే, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమలు కాకపోవచ్చని తెలుస్తోంది. కారణం, ఇందులో ప్రభుత్వం రెండు విషయాల్ని ప్రధానంగా ప్రస్తావించింది. జనాభా లెక్కలు ఒకటైతే, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన అనంతరమే ఇది అమలులోకి వస్తుందని ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి జనాభా లెక్కలు 2021లోనే ముగియాలి. కానీ, కొవిడ్ సహా ఇత్యాది కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక నియోజకవర్గాల పునర్విభజన 2026లో చేస్తారని తెలుస్తోంది.

Women Reservation Bill: సగం మంది మహిళా ఎంపీలది రాజకీయ కుటుంబమే.. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సాధారణ మహిళలకు చేయూత అందుతుందా?

ఈ లెక్కన జనాభా లెక్కల విషయాన్ని చూసుకున్నా.. ఇప్పుడు ప్రారంభించినా పూర్తవడానికి ఏడాది పడుతుంది. దీంతో ఏ విధంగానూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చేలా కనిపించడం లేదు. ఒకవేళ ఈ బిల్లు అమలులోకి వస్తే.. పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందుతుంది. వాస్తవనానికి ప్రస్తుతం పార్లమెంటులో మహిళల ప్రాధాన్యత 12 శాతంగానే ఉంది. అది కూడా 17వ లోక్ సభ(ప్రస్తుతం కొనసాగుతున్నది)లోనే ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అయితే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. కనీసంగా 33 శాతానికి మహిళా ఎంపీల ప్రాధాన్యం పెరుగుతుంది.