లోక్‌సభలో మా పార్టీ నుంచి 35 శాతం మహిళా సభ్యులు :  మమతా బెనర్జీ

  • Publish Date - March 8, 2019 / 07:47 AM IST

పశ్చిమ బెంగాల్ : లోక్‌సభలో తమ పార్టీ నుంచి 35 శాతం మహిళా సభ్యులు ఉన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం లభించనప్పటికీ.. తమ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : నేడు పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిర్ ఇండియా సర్వీసులు

స్థానిక ప్రభుత్వాల్లోనూ 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించామని గుర్తుచేశారు. స్త్రీ సాధికారతకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అందుకోసం ‘స్వస్థ్య సతి’ లాంటి పథకాల్ని ప్రారంభించామని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని మమతా ఇప్పటికే ప్రకటించారు. 
Also Read : ఎంత శాంతివంతమైన దేశమో : పాక్ పై చైనా ప్రశంసలు