రైల్వే స్టేషన్ లో యముడు : రూల్స్ బ్రేక్ చేస్తే ఎత్తుకుపోతున్నాడు

  • Publish Date - November 8, 2019 / 04:49 AM IST

రైల్వే స్టేషన్ కు ఎందుకెళతాం..రైలు ఎక్కటానికి. అలా వెళ్లిన మనకు అక్కడ సడెన్ గా యమధర్మరాజు కనిపిస్తే ఎలా ఉంటుంది. అదేంటి యమలోకంలో ఉండే యమధర్మరాజు రైల్వే స్టేషన్ కు ఎందుకొస్తాడు? అనే డౌట్ వస్తుంది. కానీ ఓరైల్వే స్టేషన్ లోకి సడెన్ గా యముడు ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కనిపించినవారిని భుజంపై వేసుకుని ఎత్తుపోతున్నాడు. అబ్బా..ఏంటీ సస్పెన్స్ అనిపిస్తోంది కదూ..అస్సలు విషయం ఏమిటంటే..

దేశవ్యాప్తంగాఫుట్ పాత్ వంతెనలు ఉన్నాగానీ రైల్వే ట్రాక్ లను క్రాస్ చేయటం, రైల్వే ట్రాక్‌ల సమీపంలో రూల్స్ బ్రేక్ చేసినవారికి అవగాహన కల్పించటానికి రైల్వే శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. షార్ట్ కట్ అనీ..త్వరగా వెళ్లిపోవచ్చని..నిర్లక్ష్యం..ఇలా అనేక కారణాలతో నిబంధలను అతిక్రమించి రోడ్డు పట్టాలను దాటేస్తుంటాం. ఇలా చేస్తే చట్టరీత్యా నేరం. అంతేకాదు ప్రాణాలకు ప్రమాదం కూడా ఏర్పడుతుంది.  అలా చాలామంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరిగాయి.  

దీంతో పశ్చిమ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ముంబై)రైలు ప్రమాదాల నుంచి కాపాడుకోవటానికి అవగాహన కార్యక్రమం చేపట్టింది. నవంబర్ 6 న వెస్ట్రన్ రైల్వే ప్రారంభించిన ఒక అవగాహన కార్యక్రమంలో యమరాజ్‌ వేషధారణలో ఉన్న వ్యక్తి రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న వారిని తన భుజానికెత్తుకొని..నిబంధనలు పాటించకపోతే మీరు ఇక డైరెక్టుగా వెళ్లేది యమలోకానికేనంటూ హెచ్చరించాడు. అలా రైల్వే స్టేషన్ లో యముడి వేషాధారణలో ఉన్న వ్యక్తని కొందరు ఫోటో తీసుకుంటున్నారు. కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరి నిబంధనలు పాటించండి..ప్రాణాలు కాపాడుకోండి. మీ నిర్లక్ష్యం మీ కుటుంబాల్లో విషాదాలకు కారణం కాకుండా నిబంధనలు పాటించండి…