Yogi Adityanath: మోదీతో రెండు గంటల పాటు యోగీ భేటీ

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. యూపీలో రెండోసారి పార్టీని గెలిపించి.. సమాజ్ వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ ను ఓడించిన యోగి..

Yoig With Modi

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. యూపీలో రెండోసారి పార్టీని గెలిపించి.. సమాజ్ వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ ను ఓడించిన యోగి.. రెండు గంటల పాటు మోదీతో చర్చించారు.

‘యోగి ఆదిత్యనాథ్ ను కలిశాను. యూపీ ఎన్నికల్లో చారిత్రక విజయం నమోదు చేసిన ఆయనకు కంగ్రాట్స్ తెలియజేశాను. ఐదేళ్లుగా అలుపెరగకుండా కష్టపడి ప్రజలకు సేవలందించారు. రాబోయే సంవత్సరాల్లో కూడా అలాగే సేవ చేసి అభివృద్ధి శిఖరాల్లో నిల్చోబెడతారని ఆశిస్తున్నా’ అని పీఎం మోడీ.. యోగితో భేటీ తర్వాత ట్వీట్ ద్వారా వివరించారు.

యూపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై క్యాబినెట్ అంశాల గురించి చర్చించినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు ప్రమాణ స్వీకారం తదితర అంశాలను చర్చించినట్లు సమాచారం.

Read Also : మంత్రివర్గ లిస్టుతో హస్తినలో యోగి.. ఎవరికి దక్కేనో ఛాన్స్!

యూపీలో బీజేపీ విజయ ఢంకా మోగించినప్పటికీ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య 7వేల ఓట్లతో ఓటమిని చవిచూశాడు. సిరాతు అనే సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయానికి గురయ్యాడు. యోగి ఆదిత్యనాథ్ రెండో డిప్యూటీ అయిన దినేశ్ శర్మ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోయారు.