you should know some intrest things about Vande Bharat Express
Vande Bharat Express: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై మధ్య ఈ రైలు పరుగులు పెడుతుంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం ప్రారంభించింది మూడవది. అయితే ఈ మిగతా రైళ్లతో పోలిస్తే ఈ రైలుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
16 కోచులు ఉన్న ఈ రైలు 1,128 మంది ప్యాసింజర్ల కెపాసిటీ ఉంది. మిగతా రైళ్లతో పోలిస్తే ఈ రైలు ప్రయాణం సంతృప్తికరంగా, విమానంలో ప్రయాణించినట్లుగా ఉంటుందని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మోదీ అన్నారు. ఇంతకు ముందు వెర్షన్తో పోలిస్తే ఈ రైలు బరువును 38 టన్నులు తగ్గించారు. వందేభారత్ ఎక్స్ప్రెస్-2 రైలు బరువు 392 టన్నులు. ఇక రెండు అడుగుల నీటిలో కూడా ఈ రైలు దూసుకెళ్తుందట.
ఈ రైళ్లు గరిష్టంగా వంద మైళ్ల వేగంతో అంటే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా వచ్చే యేడాది ఆగస్టు నాటికి 75 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 80 శాతం స్థానికంగా దొరికిన వస్తువులతోనే నిర్మాణం పూర్తిగా ఇండియాలోనే జరిగింది. మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెడుతున్నారు.
Congress President Poll: బేషరతు క్షమాపణ చెప్పిన కాంగ్రెస్ రేసు గుర్రం శశి థరూర్.. ఎందుకో తెలుసా?