Delhi Metro Train : ప్లాట్ ఫామ్ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందు దూకి యువకుడు ఆత్మహత్య
అజయ్ అర్జున్ శర్మ అనే 25 ఏళ్ల యువకుడు టికెట్ తీసుకుని కైలాష్ కాలనీ మెట్రో రైలు స్టేషన్ లోకి ప్రవేశించాడు. ప్లాట్ ఫామ్ పై రైలు కోసం వేచి ఉన్నాడు.
- bheemraj
- Updated on- July 9, 2023 / 07:16 AM IST
Delhi Metro Train (1)
Youg Man Died : ఢిల్లీలో విషాదం నెలకొంది. ప్లాట్ ఫామ్ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందు దూకి ఓ యుకువడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కైలాస్ కాలనీ మెట్రో స్టేషన్ లో శనివారం చోటు చేసుకుంది. అజయ్ అర్జున్ శర్మ అనే 25 ఏళ్ల యువకుడు టికెట్ తీసుకుని కైలాష్ కాలనీ మెట్రో రైలు స్టేషన్ లోకి ప్రవేశించాడు.
ప్లాట్ ఫామ్ పై రైలు కోసం వేచి ఉన్నాడు. అయితే రైలు ప్లాట్ ఫామ్ మీదకు వస్తుండగా ఒక్కసారిగా అతడు దాని ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. ట్రాక్ పైనుంచి మృతదేహాన్ని తొలగించారు.
Man Eat Wife Brain : మెక్సికోలో దారుణం.. భార్యను హత్య చేసి ఆమె మెదడును తిన్న భర్త
అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. నిందితుడు కైలాష్ కాలనీ తూర్పు ప్రాంతానికి చెందిన అజయ్ అర్జున్ శర్మగా ప్రాథమిక విచారణలో గుర్తించారు.
