Woman dancing in flight : విమానం మధ్యలో అమ్మాయి డ్యాన్స్.. మెట్రోలు సరిపోలేదా? అంటూ నెటిజన్లు ఫైర్
మెట్రోల్లో డ్యాన్స్‌ల హవా ఇప్పుడు విమానాలకు పాకింది. ఓ యువతి విమానం మధ్యలో నిలబడి స్టెప్పులు వేసింది. ఆ వీడియోని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Lakshmi 10tv
- Published On : May 7, 2023 / 03:07 PM IST
Woman dancing in flight
Woman dancing in flight : మెట్రోలో డ్యాన్స్‌లు చేయడం.. పడుకోవడం.. పళ్లు తోముకోవడం ఇవన్నీ చేస్తూ వైరల్ అవుతున్నది చాలదన్నట్లు కొంతమంది ఫ్లైట్‌లలో తమ టాలెంట్ చూపిస్తున్నారు . తాజాగా ఓ యువతి ఫ్లైట్ మధ్యలో నిలబడి స్టెప్పులు వేయడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియాలో కామెంట్లతో తిట్టిపోస్తున్నారు.
Scorpion bites: ఎయిరిండియా విమానంలో షాకింగ్ ఘటన.. ప్రయాణికురాలిని తేలు కుట్టింది..!
డిల్లీ మెట్రోలో రోజు ఏదో ఒక వార్త వైరల్ అవ్వడం కామనే. డ్యాన్స్‌లు, ముద్దులు, రీల్స్ ఒకటేమిటి.. రకరకాల విన్యాసాలు చేస్తూ యువతీ యువకులు వైరల్ అవుతున్నారు. అక్కడితో ఆ ట్రెండ్‌కి ఫుల్ స్టాప్ పెట్టారేమో.. ఇప్పుడు విమానంలో వైరల్ అవ్వాలనే ఆలోచన పుట్టింది ఓ యువతికి. విమానం మధ్యలో నిలబడి షాహిద్ కపూర్ సినిమా వివాహ్‌లోని “హమారీ షాదీ మే” పాటకు స్టెప్పులు వేసింది. దీంతో విమానం ఎక్కుతున్న వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియోను shibakhan అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే ఇక ఆ యువతి దారుణమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
Air Vistara : విమానంలో మామిడిపండ్లు పోగొట్టుకున్నాడు.. ఎయిర్లైన్ సిబ్బంది ఏం చేశారంటే?
“మొదటిసారి విమానం ఎక్కిందేమో అందుకే ఇలా ప్రవర్తిస్తోందని కొందరు”.. “ఆమెను ఫ్లైట్ నుంచి దించేయండి” అని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే అందరి ముందు ఎంతో ఆత్మవిశ్వాసంతో డ్యాన్స్ చేసిన ఆమె ధైర్యాన్ని కొందరు మెచ్చుకున్నారు.
