Air Vistara : విమానంలో మామిడిపండ్లు పోగొట్టుకున్నాడు.. ఎయిర్లైన్ సిబ్బంది ఏం చేశారంటే?

ఓ వ్యక్తి విమానంలో మామిడిపండ్ల బాక్స్ పోగొట్టుకున్నాడు. ఇక దొరికినట్లే అని వదిలిపెట్టలేదు. అయితే ఏం చేశాడు? అవి తిరిగి దొరికాయా?

Air Vistara : విమానంలో మామిడిపండ్లు పోగొట్టుకున్నాడు.. ఎయిర్లైన్ సిబ్బంది ఏం చేశారంటే?

Air Vistara

Air Vistara :  తల్లికి ఎంతో ఇష్టమైన మామిడిపండ్లు కొన్నాడు. ప్రయాణంలో వాటిని పోగొట్టుకున్నాడు. తిరిగి ఆ బాక్స్ ఇంటికి వచ్చేసింది. అలా ఎలా అంటారా? చదవండి.

Daughter Gift : మొదటి జీతంతో తండ్రికి విలువైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. వీడియో వైరల్

అభిషేక్ భట్నాగర్ (Abhishek Bhatnagar) అనే వ్యక్తి తన తల్లికి ఎంతో ఇష్టమైన పూణే ( Pune) స్పెషల్ ‘రత్నగిరి మామిడిపండ్లు’ (Ratnagiri aam box) కొనుగోలు చేశాడు. పూణే నుంచి ఎయిర్ విస్తారా (Air Vistara) విమానంలో ఢిల్లీకి వెళ్తూ ఆ మామిడిపళ్ల బాక్స్‌ని పోగొట్టుకున్నాడు. ఇక ఎంతో దిగులు పడ్డాడు. ఇదే విషయాన్ని ఎయిర్ లైన్‌కి ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ట్వీట్‌కి చాలామంది రీట్వీట్ చేశారు. ఇక మర్నాడు ఎయిర్లైన్ కంపెనీ అతని ఇంటికి మ్యాంగో బాక్స్‌ని పంపించింది. నిజానికి అభిషేక్ చాలా ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టాడు. మామిడిపండ్ల బాక్స్ పోవడం వల్ల తన డబ్బులు పోయినందుకు బాధపడట్లేదని తన తల్లి కోసం ఎంతో ప్రేమగా కొన్న పండ్లు పోవడం తనను చాలా బాధించిందని ఆ పోస్ట్‌లో షేర్ చేసుకున్నాడు.

precious gift for father : తండ్రికి కొడుకు ఇచ్చిన విలువైన బహుమతి .. చూడగానే ఆ తండ్రి కన్నీరు ఆగలేదు..

భట్నాగర్ పోస్ట్ పై ఎయిర్ విస్తారా సిబ్బంది స్పందించారు. బాక్స్ మిస్ అవ్వడం దురదృష్టకరమని దానిని గుర్తించే ప్రయత్నం చేస్తామని రిప్లై చేశారు. కానీ మర్నాడే భట్నాగర్ ఇంటికి మామిడిపండ్ల బాక్స్ కొనుగోలు చేసి డెలివరీ చేశారు. ఇంకేముంది భట్నాగర్ సంతోషంతో ఎయిర్లైన్ సిబ్బందికి ట్విట్టర్ లో స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. అనుకుంటాం కానీ కొన్ని విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి. అమ్మ-మామిడిపండ్లు అనే అంశం ఎయిర్లైన్స్ సిబ్బంది మనసుని సైతం బాధపెట్టి ఉంటాయి. అందుకే భట్నాగర్‌కి మామిడిపండ్ల బాక్స్ పంపించి సంతోష పరిచారు.