Those opposing burqa should be paraded naked: Ex-SP MLA Zameer Ullah Khan
UP: దేశంలో బుర్ఖాపై చాలా రోజులుగా వివాదం కొనసాగుతోంది. హిందూ సంఘాలకు చెందిన వారేమో విద్యా సంస్థల్లోకి బుర్ఖాను అనుమించకూడదంటూ ఆందోళనలు చేస్తుంటే, మరికొందరు బట్టలపై ఆంక్షలేంటంటూ మండిపడుతున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న క్రమంలో సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జమీర్ ఉల్లా ఖాన్ వివాదాస్పదంగా స్పందించారు. బుర్ఖాను రద్దు చేయాలనే వారిని నగ్నంగా వీధుల్లో తిప్పాలని అన్నారు. బుర్ఖాను తొలగించడం నేర కాదన్నప్పుడు, నగ్నంగా తిరగడం కూడా నేరం కాదంటూ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ కాలేజీలో జరిగిన సంఘటనపై జమీర్ ఉల్లా ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Kharge: బీజేపీది మనుస్మృతి పాలన, అంటే తాలిబన్ లాంటి పాలన.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
రాష్ట్రంలో మొరదాబాద్ హిందూ కాలేజీలో బుర్ఖాను నిషేధించాలంటూ నిరసనలు చేశారు. దీనిపై జమీర్ ఉల్లా ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘బుర్ఖాను నిషేధించాలనే వారిని ముందు నగ్నంగా ఊరేగించాలి. డ్రెస్ కోడ్ విధించడం ఏంటి? అలా అయితే వారిని మొత్తమే బట్టలు విప్పేయాలి. వారికి కావాల్సింది వారికి చూపించాల్సిందే కదా’’ అని ప్రశ్నించారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయగా ‘‘బుర్ఖా తొలగించడం నేరం కానప్పుడు, మిగిలిన బట్టలు తొలగించడం నేరం కాదు’’ అని జమీర్ ఉల్లా ఖాన్ అన్నారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి.
DMK On Governor: తమిళనాడు పేరు మార్పుపై గవర్నర్ క్షమాపణ చెప్పినా వెనక్కి తగ్గని డీఎంకే