Zomato : ఫుడ్ డెలివరీ చేసిన కస్టమర్లకు చాక్లెట్లు పంచి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న జొమాటో డెలివరీ ఏజెంట్
జొమాటో డెలివరీ ఏజెంట్ తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నాడు. తను ఫుడ్ డెలివరీ చేసే ప్రతి కస్టమర్‌కి చాక్లెట్లు పంచాడు. నెటిజన్ల స్పందనతో జొమాటో కూడా అతనికి కేక్ పంపింది.
- Lakshmi 10tv
- Published On : June 30, 2023 / 03:05 PM IST
Zomato
Zomato : ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ ఏజెంట్ల కష్టాలు కొన్ని వైరల్ అవుతున్నాయి. తాజాగా జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్ తన పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం వైరల్‌గా మారింది. కరణ్ ఆప్టే తను ఫుడ్ డెలివరీ చేసిన కస్టమర్లకి చాక్లెట్లు పంచి పుట్టినరోజు జరుపుకున్నాడు.
Indians on Internet 2.0 అనే ఫేస్ బుక్ యూజర్ జొమాటో డెలివరీ ఏజెంట్ 30 ఏళ్ల కరణ్ ఆప్టే తన పుట్టినరోజును ఎలా జరుపుకున్నారో తెలుపుతూ పోస్టు పెట్టారు. కరణ్ రెండు పనులు చేశాడు. ముందు తనకి ఒక షర్ట్ కొనుక్కున్నాడు. రెండవది తను ఫుడ్ ఎవరికైతే డెలివరీ చేసాడో వారికి చాక్లెట్లు పంచాడు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. నిజానికి పుట్టినరోజు అంటే చాలామంది గిఫ్ట్‌లు ఆశిస్తారు. కానీ కరణ్ తనకు తెలియని వారికి చాక్లెట్లు పంచి తన పుట్టినరోజును అందంగా జరుపుకున్నాడు.
ఇక ఈ పోస్ట్‌ను కొందరు జొమాటోకి ట్యాగ్ చేసి అతని పుట్టినరోజు జరపాలని.. అతనికి బహుమతి ఇవ్వాలని కోరారు. జొమాటో నిజంగానే అతనికి పుట్టినరోజు కేక్ పంపింది. ఆప్తే కూడా జొమాటోకి కృతజ్ఞతలు చెబుతూ కేక్ పిక్‌ను అందరితో షేర్ చేసుకున్నారు. ఇలా కరణ్ ఆప్టే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్‌తో వైరల్ అయ్యాడు.
