Bengaluru : ఫుడ్ డెలివరీ ఏజెంట్‌పై 8 ఏళ్ల బాలిక తప్పుడు ఫిర్యాదు .. ఏజెంట్‌ను చితక్కొట్టిన అపార్ట్ మెంట్‌వాసులు

పేరెంట్స్‌కి భయపడి పిల్లలు ఒక్కోసారి అబద్ధం చెబుతుంటారు. అలాంటి ఓ తప్పుడు కంప్లైంట్‌కి ఫుడ్ డెలివరీ ఏజెంట్ బుక్కయ్యాడు. 8 ఏళ్ల చిన్నారి తప్పుడు ఫిర్యాదుతో డెలివరీ ఏజెంట్‌ను ఓ అపార్ట్‌మెంట్ వాసులు చితక్కొట్టారు.

Bengaluru :  ఫుడ్ డెలివరీ ఏజెంట్‌పై 8 ఏళ్ల బాలిక తప్పుడు ఫిర్యాదు .. ఏజెంట్‌ను చితక్కొట్టిన అపార్ట్ మెంట్‌వాసులు

Bengaluru

Bengaluru : బెంగళూరులో ఓ బాలిక చేసిన తప్పుడు ఫిర్యాదుకు ఫుడ్ డెలివరీ ఏజెంట్ తన్నులు తినాల్సి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డెలివరీ ఏజెంట్ తప్పు చేయలేదని పోలీసులు నిర్ధారించారు.

Hi-tech Auto : బెంగళూరులో హైటెక్ ఆటో.. అద్భుతం అంటున్న ప్రయాణికులు

బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ బాలిక టెర్రస్ పైకి వెళ్లి ఆడుకుంటోంది. తల్లితండ్రులు వెతుకుతూ డాబాపైకి వెళ్లారు. ఇక్కడ ఏం చేస్తున్నావని తల్లితండ్రులు ఆ బాలికను నిలదీసేసరికి అటు వెళ్తున్న ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను చూపించింది. అతను తనను బలవంతంగా టెర్రస్ పైకి తీసుకెళ్లాడని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడంతో తన చేతిని కొరికాడని తల్లితండ్రులకు ఫిర్యాదు చేసింది.

 

బాలిక చెప్పిన మాటలు విని అపార్ట్ మెంట్ వాసులు .. సెక్యూరిటీ గార్డులు అంతా కలిసి ఆ ఏజెంట్‌ను దారుణంగా కొట్టారు. ఈలోపు ఇరుగు పొరుగువారు సైతం పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. బాలిక అబద్ధం చెప్పినట్లు తేలింది. ఫుటేజీలో టెర్రస్‌పై బాలిక మాత్రమే ఆడుకుంటూ కనిపించింది. ఎందుకు అబద్ధం చెప్పావని పోలీసులు బాలికను ప్రశ్నించడంతో తన పేరెంట్స్ కొడతారని భయపడినట్లు చల్లగా చెప్పింది. బాలిక తల్లితండ్రులు డెలివరీ ఏజెంట్‌కు క్షమాపణలు చెప్పారు.

Bengaluru : బస్సులోనే లంచ్ కంప్లీట్ చేస్తున్న డ్రైవర్.. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవు

సీసీటీవీ ఫుటేజీ తనను కాపాడిందని  డెలివరీ ఏజెంట్ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు. అపార్ట్‌మెంట్ వాసుల దాడితో గాయపడ్డ అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు.