Bengaluru : బస్సులోనే లంచ్ కంప్లీట్ చేస్తున్న డ్రైవర్.. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవు

బెంగళూరు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటే అంతే సంగతులు.. ఆరోజు ప్లాన్ చేసుకున్న అన్ని పనులు అయినట్లే. ట్రాఫిక్‌లో ఇరుక్కుని బస్సులోనే లంచ్ పూర్తి చేసుకుంటున్న ఓ డ్రైవర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Bengaluru : బస్సులోనే లంచ్ కంప్లీట్ చేస్తున్న డ్రైవర్.. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవు

Bengaluru

Updated On : May 30, 2023 / 12:35 PM IST

Bengaluru traffic : డేలో ప్రతిపనిని డివైడ్ చేసుకుని ప్లాన్ ప్రకారం బయటకు వస్తాం. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరగదు కదా.. మహా నగరాల్లో ట్రాఫిక్‍లో చిక్కుకుంటే అంతే సంగతులు. మన ప్రణాళిక మొత్తం తారుమారైపోతుంది. ట్రాఫిక్ కష్టాలు జనాలకు ఓ రకమైన ఇబ్బందిని తెచ్చిపెడితే వాహనాలు నడిపే డ్రైవర్లకు మరింత విసుగుని తెప్పిస్తాయి. గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు బస్సు డ్రైవర్ల కష్టాలు మామూలుగా ఉండవు. బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న బస్సులో డ్రైవర్ తన సీటులో కూర్చుని లంచ్ పూర్తి చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Bengaluru : బెంగళూరులో ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నారా? ఇక గమ్యస్ధానానికి చేరినట్లే..

కొన్ని సంవత్సరాలుగా జనాభా విపరీతంగా పెరిగిన నగరాల్లో బెంగళూరు ఒకటి. ఇదే తరహాలో వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడ వైరల్ అవుతోంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే ఇక అనుకున్న పనులన్నీ ఆలస్యమే. రీసెంట్‌గా ట్రాఫిక్‌లో నిలిచిపోయిన బస్సులో డ్రైవర్ తన లంచ్ పూర్తి చేసుకుంటున్న వీడియోను saichandshabarish అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘బెంగళూరులో పీక్ ట్రాఫిక్ మూమెంట్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. సిల్క్ బోర్డు జంక్షన్ వద్ద క్యాప్చర్ చేసిన ఈ వీడియోపై చాలామంది స్పందించారు.

Bengaluru Techie : అద్దె ఇల్లు కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి రూ. 1.6 లక్షలు కోల్పోయిన బెంగళూరు టెక్కీ.. అసలేం జరిగిందంటే?

చాలామంది డ్రైవర్ పరిస్థితి చూసి ఎమోషనల్ అయ్యారు. ‘ట్రాఫిక్ కారణంగా డ్రైవర్ ప్రశాంతంగా కూర్చుని తినే సమయం లేకపోవడం విచారకరం’ అంటూ కామెంట్లు చేశారు. బెంగళూరు సిటీలో ఇప్పటికే 20 మిలియన్ల జనాభా ఉంటుంది. 2031 నాటికి 25 మిలియన్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక రాబోయేది వర్షాకాలం. తరచు ఇక్కడ రోడ్లు మునిగిపోయి అనేకమంది ప్రమాదాల బారిన పడిన వార్తలు సైతం వింటున్నాం. ఈ నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Sai Chand Bayyavarapu (@saichandshabarish)