Bengaluru Techie : అద్దె ఇల్లు కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి రూ. 1.6 లక్షలు కోల్పోయిన బెంగళూరు టెక్కీ.. అసలేం జరిగిందంటే?

Bengaluru Techie : బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. అద్దె ఇల్లు కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు.. అంతే.. బ్యాంకు అకౌంట్లలో నుంచి లక్షకు పైగా డబ్బులు కొట్టేశారు మోసగాళ్లు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Bengaluru Techie : అద్దె ఇల్లు కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి రూ. 1.6 లక్షలు కోల్పోయిన బెంగళూరు టెక్కీ.. అసలేం జరిగిందంటే?

Bengaluru techie loses 1.6 lakh while searching for house on rent

Bengaluru Techie : బెంగళూరులో ఇళ్లు దొరకడం కష్టమే.. చాలామంది టెక్కీలు సరైన ఇంటి కోసం తెగ వెతికేస్తుంటారు. మరికొంతమందికి ఇంటిఇంటికి వెళ్లి తిరిగే వీలు ఉండదు. అందుకే ఎక్కువ మంది ఆన్‌లైన్ బ్రోకర్ వెబ్ సైట్లపై ఆధారపడుతుంటారు. నచ్చిన ఇల్లు దొరికిందంటే.. అద్దెతో పాటు ఇల్లు చూపించిన బ్రోకరేజ్ కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు, ఉద్యోగంలో చేరడం కన్నా నగరంలో ఇల్లు సంపాదించడమే కష్టంగా ఉంటుంది. అయితే అంతే కాదు. గృహావసరాల అధిక డిమాండ్‌ను బట్టి కొందరు స్కామర్లు డబ్బు కోసం మోసాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి స్కామర్‌ల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ, స్కామర్లు ఆకర్షణీయమైన ఫొటోలతో ఆన్‌లైన్‌లో గుర్తుతెలియని లేని ఫ్లాట్‌ల ఫేక్ వివరాలను పోస్ట్ చేస్తున్నారు.

ఇల్లు కోసం వెతికేవారే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇల్లు తక్కువ ధరకు అద్దెకు ఇప్పిస్తామంటూ ఆఫర్ చేస్తున్నారు. ఇటీవల అద్దె ఇల్లు కోసం వెతుకుతున్న బెంగళూరు టెక్కీ ఈ సైబర్ మోసగాళ్ల వలల పడ్డాడు. దాదాపు రూ.1.6 లక్షలను కోల్పోయాడు. కోల్‌కతాకు చెందిన 25 ఏళ్ల టెక్కీ ఇటీవల కడుబీసనహళ్లిలోని ప్రముఖ ఐటీ సంస్థలో అధిక వేతనంతో ఉద్యోగంలో చేరాడు. జూన్ 1న బెంగళూరకు వెళ్లి తన కొత్త రోల్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కానీ, అంతకంటే ముందు బెంగళూరులో ఉండేందుకు ఇల్లు కావాల్సి వచ్చింది. అందుకోసం అద్దె ఇల్లు కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నాడు. మంచి ఇంటి కోసం చూస్తున్న అతడి నుంచి స్కామర్లు నమ్మించి లక్షల నగదు కొట్టేశారు.

Bengaluru techie loses 1.6 lakh while searching for house on rent

Bengaluru techie loses 1.6 lakh while searching for house on rent

Read Also : PhonePe UPI Lite : పోన్‌పేలో ఇకపై యూపీఐ పిన్ లేకుండానే పేమెంట్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

బెంగళూరులో అద్దె ఇళ్ల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుండగా.. రియల్ ఎస్టేట్ పోర్టల్ NoBrokerలో మారతహళ్లిలో ఒక ఫ్లాట్ గురించి ఆకర్షణీయమైన ఆఫర్‌ కనిపించింది. నెలవారీ అద్దె రూ. 25వేలుగా ఉంది. అంతేకాదు.. రెండు నెలల అద్దె చెల్లించాలి. అడ్వాన్స్ చెల్లించాడు. అందులో ఇచ్చిన కాంటాక్టు నంబర్‌కు కాల్ చేశాడు. ఆ ఇంటి యజమానిగా ముంబైలో పోస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ అధికారిగా నమ్మించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి ఆ ఇల్లు మంచిగా అనిపించింది. ఆఫీసుకు ఆ ఇల్లు దగ్గరగా ఉండటంతో వెంటనే అద్దెకు తీసుకోవాలనుకున్నాడు. ఇంటిని తనకే అద్దెకు ఇవ్వాలని ఆ సైనిక అధికారిని కోరాడు.

బెంగుళూరు ఫ్లాట్‌కు మేనేజర్ అని చెప్పుకునే వ్యక్తితో మాట్లాడించారు. ఆ ఇద్దరు GooglePay ద్వారా చేసిన డీల్‌ను సీల్ చేసేందుకు రూ. 4వేలు డిపాజిట్ చేయమని అడిగారు. వెంటనే అద్దె ఇల్లు కోసం అడిగినంత పేమెంట్ చేశాడు. ఇల్లును చూడాలంటే ముందుగా పేమెంట్ చేసినట్టుగా విజిటింగ్ పాస్‌ను ఇవ్వాలన్నారు. అందుకు మొత్తం పేమెంట్ ఇప్పుడే చేయాల్సిందిగా కోరారు. పేమెంట్ పోర్టల్‌ చూడగానే నమ్మకం కలిగింది. చూడటానికి రియల్ పోర్టల్ మాదిరిగానే అనిపించింది. ఎనిమిది వరకు ఆన్‌లైన్ లావాదేవీలు చేసిన తర్వాత మోసపోయినట్టు గుర్తించాడు. మొత్తం రూ. 1.6 లక్షలు వరకు పేమెంట్ చేసినట్టుగా బాధిత టెక్కీ వాపోయాడు. ఆ తర్వాత మోసగాళ్లను గుర్తించలేకపోయానని బాధిత టెక్కీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Read Also : Vivo X90 Pro Series : ఫ్లిప్‌కార్ట్‌లో వివో X90 సిరీస్‌పై స్పెషల్ ఆఫర్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!