Bengaluru : బెంగళూరులో ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నారా? ఇక గమ్యస్ధానానికి చేరినట్లే..

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవు. నగర శివార్లలో ఉండేవారు పని మీద బయటకు వస్తే గమ్యస్ధానానికి చేరుకున్నట్లే. ఉబెర్ ఆటో బుక్ చేసుకుంటే గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి. తాము పడుతున్న ఇబ్బందుల్ని బెంగళూరువాసి ట్విట్టర్‌లో షేర్ చేసాడు.

Bengaluru : బెంగళూరులో ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నారా? ఇక గమ్యస్ధానానికి చేరినట్లే..

Bengaluru

Transport problems in Bangalore suburbs : బెంగళూరును కష్టాల మీద కష్టాలు పలకరిస్తున్నాయి. ఇప్పటికే అద్దె ఇళ్ల కష్టాలు చూస్తున్నాము. ఇక నగర శివార్లలో ఉండేవారు సరైన రవాణా సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ రద్దీ ఉన్నసమయంలో ఉబెర్ ఆటో బుక్ చేసుకుంటే ఇక గమ్యస్ధానానికి చేరినట్లే. అనుశాంక్ జైన్ అనే వ్యక్తి పీక్ అవర్స్‌లో ఉబెర్ బుక్ చేసిన తరువాత ఏం జరిగిందో ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

Bengaluru Techie : అద్దె ఇల్లు కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి రూ. 1.6 లక్షలు కోల్పోయిన బెంగళూరు టెక్కీ.. అసలేం జరిగిందంటే?

అనుశాంక్ జైన్ ఉబెర్ ఆటోను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆటో అతని వద్దకు చేరడానికి 71 నిముషాలు చూపించింది. ఇక అతను ఈ విషయానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ‘ఉబెర్ డ్రైవర్ నాకు కనిపిస్తే బాగుండును. అతని మీద నాకు గౌరవం పెరిగింది’..అనే శీర్షికను కూడా అనుశాంక్ పోస్ట్‌కి ట్యాగ్ చేశాడు. విషయం ఏంటంటే అనుశాంక్ ఉబెర్ బుక్ చేసిన నిముషంలోనే డ్రైవర్ దానిని క్యాన్సిల్ చేశాడట. దీనిని బట్టి ట్రాఫిక్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చును. అనుశాంక్ పోస్ట్‌కి చాలామంది నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్లు పెట్టారు.

Bengaluru Woman: బైక్ నుంచి కిందకు దూకేసి.. తెగువ చూపిన బెంగళూరు మహిళ..

ఒక్కోసారి ఎటూ దారి లేక కస్టమర్లు ఎంత సమయం అయినా వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా బెంగళూరులో కనిపిస్తుంది. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువే. ఆఫీసులకి చేరుకోవడానికి గంటలకొద్దీ సమయం పడుతుందని ఇక్కడి వారు ఫిర్యాదు చేస్తుంటారు. ఇక ఇలాంటి సంఘటనలు చూస్తుంటే వారు చెప్పింది నిజమే అనిపిస్తోంది.