Hi-tech Auto : బెంగళూరులో హైటెక్ ఆటో.. అద్భుతం అంటున్న ప్రయాణికులు

రీసెంట్‌గా కూలర్ ఆటో చూసాం. ఇప్పుడు బెంగళూరు రోడ్లపై హైటెక్ ఆటో తిరుగుతోంది. అందరిలా కాకుండా తన ఆటో భిన్నంగా ఉండాలనుకున్నాడేమో ఆ ఆటో డ్రైవర్ తన ఆటోని డిఫరెంట్‌గా తయారు చేయించాడు. ఈ ఆటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Hi-tech Auto : బెంగళూరులో హైటెక్ ఆటో.. అద్భుతం అంటున్న ప్రయాణికులు

Bengaluru

Bangalore viral video : బెంగళూరు సిటీ రోడ్లపై ఓ స్పెషల్ ఆటో పరుగులు పెడుతోంది. ప్రయాణికులకు అట్రాక్ట్ చేయడానికి ఆటో డ్రైవర్ తన ఆటోని డిఫరెంట్‌గా తయారు చేయించాడు. ఆ ఆటో ప్రత్యేకత ఏంటో చదవండి.

Bengaluru : బస్సులోనే లంచ్ కంప్లీట్ చేస్తున్న డ్రైవర్.. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవు

ఇటీవల కాలంలో చాలామంది ఆటో డ్రైవర్లు ఆటోలను అప్ గ్రేడ్ చేస్తున్నారు. వేసవికాలంలో కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఆటో వెనుక భాగంలో కూలర్ అమర్చి అందర్నీ ఆకట్టుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. ఇక బెంగళూరులో కొత్తగా వచ్చిన  హైటెక్ ఆటో చూస్తే ఫిదా అయిపోతారు. ఈ ఆటోలో గాజు కిటికీలు..రెండు ఫ్యాన్లు .. ఖరీదైన సీట్లు ఆకట్టుకుంటాయి.

 

దివంగత నటులు శంకర్ నాగ్, పునీత్ రాజ్ కుమార్ పోస్టర్లు కూడా ఉన్నాయి. స్టీరింగ్ వీల్ పక్కన ఒక రకమైన డిజిటల్ స్క్రీన్ కూడా ఉంది. ఆటో రంగు రంగుల లైట్లతో మెరిసిపోతోంది. ట్విట్టర్ యూజర్ అజిత్ సహాని Ajith Sahani ఈ వీడియోని షేర్ చేశారు. “హలో #బెంగళూరు ఎంత అందమైన మరియు అద్భుతమైన ఆటో.. ఎవరైనా ఇంత దూరం ప్రయాణించారా” అనే శీర్షికతో ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Cooler Auto : ‘కూలర్ ఆటో చూసారా?’ ఆటో డ్రైవర్ సూపర్ ఐడియా

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఆటో డ్రైవర్ కాంటాక్ట్ నంబర్ కావాలని.. బెంగళూరు వాళ్లు ఏం చేసినా గర్వంగా ఉంటుందని’ కామెంట్లు పెట్టారు. తాము అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని కావచ్చు.. ప్రయాణికులను ఆకర్షించడానికి కావచ్చు ఆటో డ్రైవర్లు కూడా సరికొత్త క్రియేటివిటీతో ముందుకు వెళ్తున్నారు.