Peddi Ticket Price: ‘పెద్ది’ టీంకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి
Peddi Ticket Price Hike : పెద్ది(Peddi) సినిమా టికెట్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
Andhra Pradesh Government issued orders increasing ticket fare for peddi movie
- పెద్ది సినిమాకు స్పెషల్ షోలు
- టికెట్ల ధరల పెంపునకు అనుమతి
- ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు
Peddi Ticket Price: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పెద్ది(Peddi)’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ వేగవంతం చేసింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం మేకర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించగా, దానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
*Faria abdullah: జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. గ్రీన్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే మెరుపులు
రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచే ఏపీవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవచ్చు. ఈ ప్రత్యేక షోలకు టికెట్ ధరను రూ. 600 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు. ఇక విడుదల రోజైన జూన్ 4 నుండి జూన్ 10 వరకు (మొదటి వారం రోజుల పాటు) సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున అదనంగా పెంచుకునేందుకు వీలు కల్పించారు. అలాగే రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతి లభించింది.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను దర్శకుడు బుచ్చిబాబు సన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటు మరియు టికెట్ ధరల పెంపుతో ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
