Swiggy delivery boy story : తిండి లేదు.. బైక్ లేదు.. ఫుడ్ డెలివరీ కోసం కిలోమీటర్లు నడిచాడు.. నెటిజన్ల సాయంతో జాబ్ సంపాదించుకున్నాడు

ఇంజినీరింగ్ చదువుకున్న అతను జాబ్ దొరక్క ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేరాడు. అతను పడుతున్న కష్టాలు చూసి ఓ నెటిజన్ మనసు చలించిపోయింది. సోషల్ మీడియా చేసిన సాయంతో అతనిప్పుడు మంచి జాబ్ సంపాదించుకున్నాడు. ఎవరతను? చదవండి.

Swiggy delivery boy story :  తిండి లేదు.. బైక్ లేదు.. ఫుడ్ డెలివరీ కోసం కిలోమీటర్లు నడిచాడు.. నెటిజన్ల సాయంతో జాబ్ సంపాదించుకున్నాడు

Swiggy delivery boy story

Updated On : June 15, 2023 / 11:14 AM IST

Viral news : అతను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదువుకున్నాడు. సరైన జాబ్ దొరక్క స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేరాడు. ఫుడ్ డెలివరీ చేయడానికి అతను పడ్డ కష్టాలు విని నెటిజన్లు చలించిపోయారు. ఫైనల్లీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు మంచి జాబ్ సంపాదించుకున్నాడు.

Minister Nirmala Sitharaman : పింఛను కోసం 70 ఏళ్ల వృద్ధురాలు కష్టం చూసి చలించిపోయిన మంత్రి సీతారామన్.. అధికారులకు ఆదేశాలు

స్విగ్గీలో పనిచేసిన డెలీవరీ బాయ్ సాహిల్ సింగ్ ఇంజినీరింగ్ చదువుకున్నాడు. కొన్ని కంపెనీలలో పనిచేసినప్పటికీ కరోనా సమయంలో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇక ఫుడ్ డెలీవరీ బాయ్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఇటీవల లింక్డ్‌ఇన్ వినియోగదారు ప్రియాంషి చందేల్ (Priyanshi Chandel) ఇంటికి స్విగ్గీ నుంచి ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఫుడ్ డెలివరీ చేయడానికి అతనికి 30 నుంచి 40 నిముషాల సమయం పట్టింది. చేరాల్సిన అడ్రస్‌కి చేరిన తరువాత ప్లాట్ బయట కాసేపు కూలబడిపోయాడు. ఇంత ఆలస్యానికి కారణం ఏంటని ప్రశ్నించిన ప్రియాంషి చందేల్ అతను చెప్పింది విని చలించిపోయారు.

 

సాహిల్ సింగ్ ఫుడ్ డెలివరీ చేయడానికి తన దగ్గర వెహికల్ లేదని అందుకే 3 కి.మీ నడుచుకుంటూ వచ్చి ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ- బైక్‌కి కూడా అద్దె చెల్లించే పరిస్థితిలో లేనని వారం రోజులుగా అసలు భోజనం చేయలేదని టీ తో కడుపు నింపుకుంటున్నానని.. ఈ నిర్దిష్ట ఆర్డర్‌కు తనకు కేవలం రూ.20 నుంచి రూ.25 లభిస్తాయని తన దుస్థితిని వివరించాడు. వెంటనే ప్రియాంషి “ఆఫీస్ బాయ్ కోసం ఓపెనింగ్స్, అడ్మిన్ వర్క్, కస్టమర్ సపోర్ట్ మొదలైనవాటిని” ఉంటే చెప్పమంటూ  సాహిల్ సింగ్  మార్కు షీట్లు, కాలేజీ సర్టిఫికేట్లు.. గుర్తింపు కార్డులను లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. అతని స్టోరీ వైరల్ అయ్యింది.

74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి

సోషల్ మీడియాలో అతని స్టోరి విని అనేకమంది మద్దతుగా నిలిచారు. సాహిల్ సింగ్‌కు ఇప్పుడు మంచి జాబ్ వచ్చినట్లుగా తెలుస్తోంది.