74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి

వయసు మీద పడగానే ఇంక అంతా అయిపోయిందనుకుంటారు చాలామంది. కానీ వయసు ఒక నంబర్ మాత్రమే అని భావిస్తారు కొందరు. జీవించినంత కాలం కష్టపడుతూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. హసన్ అలీని చూస్తే అదే అనిపిస్తుంది. ఆయనని ఆదర్శంగా తీసుకోవాలి అనిపిస్తుంది.

74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి

74-year-old Hasan Ali Story

74-year-old Hasan Ali Story : రిటైర్మెంట్ అయ్యాక చాలామంది విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటారు. కుటుంబంతో హాయిగా గడపాలని ఆశిస్తారు. ముంబయి చెందిన హసన్ అలీని చూస్తే మాత్రం మీరు ఆ ఆలోచన తప్పు అంటారు.

coconut seller : QR కోడ్‌తో అమ్మకాలు చేస్తున్న కొబ్బరి వ్యాపారి .. అభినందిస్తున్న నెటిజన్లు

ముంబయి బోరివాలి స్టేషన్‌ కి వెళ్తే ప్రతిరోజు 74 ఏళ్ల హసన్ అలీ కనిపిస్తారు. చేతి నిండా రుమాళ్లు పెట్టుకుని విక్రయిస్తూ ఉంటారు. ఇంత వయసులో ఈయనకి ఏం కష్టం వచ్చింది? రెస్ట్ తీసుకోక అనుకునేరు. మంచాన పడకుండా ఇలా పని చేసుకోవడమే తనకు ఇష్టమంటారు హసన్. గతంలో ఓ చెప్పుల దుకాణంలో సేల్స్ మ్యాన్‌గా పనిచేసిన అనుభవం ఇప్పుడు రుమాళ్ల వ్యాపారానికి ఎంతగానో కలిసి వచ్చిందని హసన్ అంటారు. అమ్మడం అనేది ఒక కళ అని అందులో తాను చాలా సంవత్సరాలుగా ప్రావీణ్యం సంపాదించానని హసన్ చెబుతారు. తన భార్య, పిల్లలు ఇంక ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటావు అని అడుగుతూ ఉంటారని.. మంచాన పడకుండా పని చేస్తూనే ఉంటానని హసన్ నవ్వుతూ చెబుతారు.

 

ఉదయాన్నే రుమాళ్లు పట్టుకుని బస్సెక్కి ఇంటి నుంచి బయలుదేరతారు హసన్. మరలా రాత్రికి ఇంటికి చేరుకుంటారు. హసన్‌ను ఈ ప్రాంతంలో అందరూ ముద్దుగా కాకా అని పిలుస్తారు. officialhumansofbombay అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో హసన్ అలీకి సంబంధించిన కథనం పోస్ట్ చేశారు. ఇది ఎంతోమంది యూజర్ల మనసు కదిలించింది.

Mangoes on EMI : EMIలో మామిడిపండ్లు అందిస్తున్న పూనే వ్యాపారి.. ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు

చాలామంది తమకు నచ్చిన పని దొరకలేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ హసన్ అలీ స్టోరి చదివితే ఏ పనిని చేసినా దానిని ఎంతగా ప్రేమించవచ్చునో అర్ధం అవుతుంది. అంతేకాదు వయసుతో సంబంధం లేకుండా కష్టపడి పనిచేస్తే ఆరోగ్యంగా కూడా ఉంటామనే విషయాన్ని స్పష్టం చేస్తుంది ఈ స్టోరి. హ్యాట్సాఫ్ టూ హసన్ అలీ.