Mangoes on EMI : EMIలో మామిడిపండ్లు అందిస్తున్న పూనే వ్యాపారి.. ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు

మామిడిపండ్ల సీజన్ మొదలవగానే రేట్లు చుక్కలు చూపిస్తాయి. వీటిలో కొన్ని రకాలు కొనడానికి జనం వెనకడుగు వేస్తారు. అయితే ఖరీదైనా మామిడిపండ్లు ఇప్పుడు EMI లో దొరుకుతున్నాయి. మీరు విన్నది నిజమే.. మీకు ఇష్టమైన మామిడిపండ్లను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసుకోవచ్చు.

Mangoes on EMI : EMIలో మామిడిపండ్లు అందిస్తున్న పూనే వ్యాపారి.. ఆసక్తి చూపిస్తున్న కొనుగోలుదారులు

Mangoes on EMI

Mangoes on EMI : పండ్లలో రారాజు మామిడి. వేసవికాలం వచ్చిందంటే రకరకాల మామిడిపండ్లు మార్కెట్లో కనిపిస్తాయి. రకాన్ని బట్టి రేట్లు కూడా భారీగానే ఉంటాయి. ఒక్కోసారి ఎంతో ఇష్టమైన మామిడి ధరలు చూసి జనం కొనడానికి వెనకడుగు వేస్తారు. అయితే ఎంతో ఇష్టపడే మామిడిపండ్లని ఇప్పుడు EMI లో కొనుగోలు చేసుకోవచ్చు. పూనే వ్యాపారి సనాస్ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇదేదో బాగుందే అనుకుంటూ జనం కొనడానికి సిద్ధమవుతున్నారు.

Daughter Gift : మొదటి జీతంతో తండ్రికి విలువైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. వీడియో వైరల్

దేవ్‌గఢ్ (Devgad ) మరియు రత్నగిరి (Ratnagiri) ప్రాంతాల్లో అల్ఫోన్సో (Alphonso) లేదా హాపస్ (Hapus) జాతికి చెందిన మామిడిపండ్లు ఎంతో ప్రసిద్ధి. వాటి ధర కూడా కాస్త ఎక్కువే. ప్రస్తుతం వీటి ధర డజను 800 రూపాయల నుంచి 1300 వందల రూపాయల వరకూ పలుకుతోంది. అంతే వీటి డిమాండ్ అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇవి తినడానికి ఇష్టపడేవారు రేటు చూసి హడలిపోతుంటారు. అయితే పూనేకి చెందిన సనాస్ (Sanas) ఈ పండ్లను ఇప్పుడు EMI లో అందిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.. ఇది నిజం.

సనాస్ కుటుంబానికి చెందిన ఈ మామిడి పండ్ల అవుట్ లెట్ EMI లో విక్రయిస్తూ దేశంలోనే మొదటిస్ధానంలో ఉందట. సాధారణంగా టీవీలు, ఫ్రిజ్ లు, ఏసీలు వీటినే EMI లో విక్రయిస్తుంటారు. అలాంటిది మామిడిపండ్లను కూడా సులభవాయిదాల్లో ఎందుకు అమ్మకూడదనే ఆలోచన రావడంతోనే వీరు అమ్మకాలు మొదలుపెట్టారట. అయితే ఈ అవకాశం క్రెడిట్ కార్డు (credit card)  వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందట. అదీ కనీసం 5000 రూపాయల వరకూ కొనుగోలు చేసిన వారికి మాత్రమే మూడు, ఆరు నుంచి 12 నెలల EMI ద్వారా చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తారట.

SBI Server Down : టెక్నికల్ స్టాఫ్ లంచ్ చేస్తూ ఉండిపోయారేమో?.. SBI కస్టమర్స్ ఫన్నీ జోక్స్ వైరల్

ఇక ఈ ఖరీదైన మామిడిపండ్లను కొనడానికి దేశవ్యాప్తంగా చాలామంది ఆసక్తి చూపుతున్నారట. కొంతమంది ఆల్రెడీ కొనుగోళ్లు చేసారని సనాస్ చెబుతున్నారు. ఏది ఏమైనా ఎంతో ఇష్టమైన మామిడిపండ్లను తినలేకపోయామని నిరాశపడనక్కర్లేకుండా మ్యాంగో లవర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.