SBI Server Down : టెక్నికల్ స్టాఫ్ లంచ్ చేస్తూ ఉండిపోయారేమో?.. SBI కస్టమర్స్ ఫన్నీ జోక్స్ వైరల్

గత మూడురోజులుగా SBI సర్వర్ పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ ఆన్ లైన్ పేమెంట్స్ నిలిచిపోవడంతో విసుగు చెందారు. సంస్థ ఉద్యోగులు ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ పోస్ట్ చేసారు.

SBI Server Down : టెక్నికల్ స్టాఫ్ లంచ్ చేస్తూ ఉండిపోయారేమో?.. SBI కస్టమర్స్ ఫన్నీ జోక్స్ వైరల్

SBI server down users jokes viral

SBI Server Down :  సమస్య ఏదైనా సోషల్ మీడియాలో జనం షేర్ చేయడం అది వైరల్ అవడం కామనైపోయింది. ఇక బ్యాకింగ్ సేవలకి సంబంధించిన కష్టాలు వస్తే కస్టమర్లు ఊరుకుంటారా? ఫ్రస్టేట్ అయిపోరూ.. తాజాగా SBI సర్వర్ ( పనిచేయకపోవడంతో తమ ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయి విసుగు చెందిన కస్టమర్లు రకరకాల మీమ్స్, జోక్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.

Ram Ramapati Bank : ఆ ‘బ్యాంక్‌లో శ్రీరామ నామాలే డిపాజిట్లు’ .. ఆ చెట్టుతో చేసిన పెన్నుతో రామనామాలు రాయాలట,రాముడి బ్యాంకు పూర్తి విశేషాలు

సోమవారం నాడు SBI సర్వర్ (server) సరిగా పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్ EMI లు, క్రెడిట్ కార్డ్ (credit card) పేమెంట్స్ చేయడం కష్టమైంది. నెట్ బ్యాంకింగ్ (net banking), యూపీఐ (UPI), యోనో (YONO app) యాప్ లు ఉదయం నుంచి పనిచేయకపోవడంతో కష్టమర్లు (customers) విసుగు చెందారు. దీంతో తాము చేయాల్సిన పేమెంట్స్ నిలిచిపోయాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ట్విట్టర్ వేదికగా కస్టమర్లు పెట్టిన జోక్స్ (jokes), మీమ్స్ (memes) ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆ సంస్థ టెక్నికల్ ఉద్యోగులు లంచ్ చేయడంలో ఉండిపోయారని.. ఇక జీతాలు రాకపోవడంతోనే ఇదంతా జరుగుతోందని ట్విట్టర్ లో (twitter) ఫన్నీ పోస్ట్ లు పెట్టారు. మూడురోజులుగా సర్వర్ పనిచేయకపోతుంటే సంస్థ ఏం చేస్తోందని కొందరు ప్రశ్నించారు.

World Bank Chief : ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా ..

ఇదిలా ఉంటే ఇలాంటి అంతరాయాలు ఏర్పడినప్పుడు వీటని ట్రాక్ చేసే “డౌన్‌డిక్టేటర్” (downdetector) వెబ్ సైట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ సమస్య ఏప్రిల్ 3 ఉదయం గం. 9.19 మొదలై ఆదివారం కూడా కొనసాగిందని తెలిపింది. కారణాలు ఏమైనా కస్టమర్లు మాత్రం గత మూడురోజులుగా తమ ఆన్ లైన్ పేమెంట్స్ ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.