World Bank Chief : ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా ..

అజయ్ బంగా 1959 నవంబర్ 10న పుణెలో జన్మించారు. బంగా బాల్య జీవితం భారతదేశంలోనే గడిచింది. ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశారు. 2016లో పద్మశ్రీ అవార్డుతో అజయ్ బంగాను భారత ప్రభుత్వం గౌరవించింది.

World Bank Chief : ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా ..

Ajay Banga

World Bank Chief : ప్రపంచంలోని పలు దేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. వీరిలో అజయ్ బంగా కూడా చేరిపోయాడు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖరారైంది. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో బుధవారం నామినేషన్లు ముగిశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్ కొనసాగుతున్నారు. అయితే, ఆయన పదవీకాలం ఒక సంవత్సరం ఉంది. ముందస్తుగా మాల్సాస్ పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాక్ అధ్యక్ష పదవికి ప్రతిపాదించారు. సాధారణంగా అమెరికా ప్రతిపాదించిన వ్యక్తికే ప్రపంచ బ్యాంక్ నాయకత్వ బాధ్యతలు దక్కుతూ వస్తున్నాయి.

Pakistan Twitter Account Blocked: భారత్‌లో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా బ్లాక్..! ఎందుకంటే..

ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న డేవిడ్ మల్సాస్‌ను 2019లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించే వ్యక్తిగా బంగాను ప్రకటించినప్పుడు బిడెన్ ఈ చరిత్రలో క్లిష్టమైన సమయంలో ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడు అని చెప్పారు. వాషింగ్టన్‌కు చెందిన ప్రపంచ బ్యాంక్ ఫిబ్రవరి నెల చివరి వారంలో నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అజయ్ బంగా తన నామినేషన్ కు మద్దతుకోసం గత నెలలో ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించారు. ఈ క్రమంలో భారతదేశంలోనూ పర్యటించారు. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్‌పాస్ జూన్‌లో ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. ఆ తరువాత అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు. ఈ పదవికోసం నామినేట్ అయిన తొలి భారత సంతతి వ్యక్తి అంజయ్ బంగా కావడం గమనార్హం.

World Cup 2023: మీరలా అయితే.. మేమిలా! బీసీసీఐకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు..

అజయ్ బంగా 1959 నవంబర్ 10న పుణెలో జన్మించారు. బంగా బాల్య జీవితం భారతదేశంలోనే గడిచింది. ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశారు. అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట, సీఈఓగా పనిచేశారు. బంగా ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు గౌరవ అధ్యక్షుడు. 2020-21 వరకు చైర్మన్‌గా కొనసాగారు. 2016లో పద్మశ్రీ అవార్డుతో అజయ్ బంగాను భారత ప్రభుత్వం గౌరవించింది.