coconut seller : QR కోడ్‌తో అమ్మకాలు చేస్తున్న కొబ్బరి వ్యాపారి .. అభినందిస్తున్న నెటిజన్లు

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్ లైన్ ఆర్దిక కార్యకలాపాలే. రోడ్డు సైడ్ చిన్న వ్యాపారులు సైతం తమ రోజు వారి అమ్మకాలు ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. తాజాగా ఓ కొబ్బరి వ్యాపారి QR కోడ్‌తో తన అమ్మకాలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు.

coconut seller : QR కోడ్‌తో అమ్మకాలు చేస్తున్న కొబ్బరి వ్యాపారి .. అభినందిస్తున్న నెటిజన్లు

coconut seller

coconut seller : డిజిటలైజేషన్‌తో (Digitalization) ఇండియా ముందుకి వెళ్తోందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తమ ఆర్ధిక కార్యకలాపాలన్ని ఆన్‌లైన్‌లో ద్వారా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక కొబ్బరి బొండాల వ్యాపారి (coconut seller) సైతం తన వ్యాపారాన్ని QR కోడ్‌తో (QR code) జరుపుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మనసు దోచుకుంది.

Viral Video : షాకింగ్.. పోలీస్‌ని 20 కిమీ లాక్కెళ్లిన కారు డ్రైవర్, వీడియో వైరల్

ఓ కొబ్బరి బొండాం అమ్మే వ్యక్తి తన బైక్ మీద కొబ్బరి బొండాలతో నిలబడి ఉన్నాడు. ఆర్కే మిశ్రా (RK Misra) అనే వ్యక్తి కొబ్బరి బొండాం తాగుదామని అతని దగ్గరకు వెళ్లాడు. అతని బైక్ కి QR కోడ్ ని పెట్టుకున్నాడు. కొబ్బరి బొండాలు కొనుగోలు చేశాక మిశ్రా QR కోడ్ ద్వారా అతనికి అమౌంట్‌పే చేశారు. తరువాత మిశ్రా ఈ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ కొబ్బరి బొండాం వ్యాపారిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Children’s Amazing Dance : ‘పర్దేశియా’ సాంగ్‌కి దుమ్మురేపుతున్న చిన్నారులు వీడియో వైరల్

కొబ్బరి బొండాం వ్యాపారి క్యాష్ కంటే UPI ని యాక్సెప్ట్ చేయడం ఉత్తమమైన పని అని .. నిజంగా ఇది డిజిటల్ విప్లవమని కొందరు కామెంట్లు పెట్టారు. భువనేశ్వర్ సైడ్ ఇలా కొబ్బరి వ్యాపారులు UPI తో అమ్మకాలు చేయడం సర్వసాధారణమని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ ఫోటో ఇప్పడు నెటిజన్లను ఆకర్షిస్తోంది.