Children’s Amazing Dance : ‘పర్దేశియా’ సాంగ్‌కి దుమ్మురేపుతున్న చిన్నారులు వీడియో వైరల్

కొంతమంది పిల్లల టాలెంట్ చూస్తే వీళ్లు పిల్లలు కాదు పిడుగులు అంటాం. ఓ చిన్నారుల గ్రూప్ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్ల స్టెప్పులకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Children’s Amazing Dance : ‘పర్దేశియా’ సాంగ్‌కి దుమ్మురేపుతున్న చిన్నారులు వీడియో వైరల్

Children's Amazing Dance

Updated On : April 16, 2023 / 12:39 PM IST

Children’s Amazing Dance :  ఇటీవల కాలంలో కొన్ని హిట్ సాంగ్స్‌కి చాలామంది రీల్స్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. రీసెంట్ గా సింగర్ కిషోర్ కుమార్ (Kishore Kumar) పాడిన పెప్పీ సాంగ్ పర్దేశియాకి (Pardesiya) చాలామంది రీల్స్ (reels) చేశారు. కానీ ఓ పాఠశాల విద్యార్ధులు చేసిన డ్యాన్స్ మాత్రం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఆగని డ్యాన్స్‌ల హంగామా.. భోజ్‌పురీ సాంగ్‌కి అమ్మాయి డ్యాన్స్ వీడియో వైరల్

ఇటీవల కాలంలో చాలామంది హిట్ సాంగ్స్ తీసుకుని రీల్స్ చేయడం వైరల్ అవ్వడం కామన్ అయిపోయింది. అయితే కొన్ని మాత్రం ఒరిజినల్ సాంగ్స్‌ని మించి కొరియోగ్రఫీ (choreography) చేసి స్టెప్పులతో దుమ్ము లేపుతున్నారు. రీసెంట్ గా ఓ పాఠశాల విద్యార్ధులు కొందరు యూనిఫామ్ వేసుకుని కిషోర్ కుమార్ పాడిన పర్దేశియా పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలో చిన్నారుల స్టెప్ప్ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. @gmgjddance అనే ఇన్ స్టా యూజర్ దీనిని షేర్ చేయడంతో వైరల్ గా మారింది. లక్షల్లో వ్యూస్ తో దూసుకుపోతోంది.

Old Man Dance Goes Viral : మనవడి పెళ్లిలో 96 ఏళ్ల వృద్ధుడు చేసిన డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెడతారు

డ్యాన్స్ చేస్తున్న పిల్లల్లో ఎంతో కాన్ఫిడెన్స్ కనిపిస్తోందని కొందరు.. ఈ చిన్నారులకు మంచి ఫ్యూచర్ ఉందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో కలిసి కామెడీ వీడియోలు చేయడం.. డ్యాన్స్ లు చేయడం, వంటలు చేయడం కామన్ అయిపోయింది. ఇలా కొంతమంది విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలాగే ఈ పిల్లల వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ను ఆకట్టుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Jd Jd (@gmgjddance)