Viral Video : షాకింగ్.. పోలీస్‌ని 20 కిమీ లాక్కెళ్లిన కారు డ్రైవర్, వీడియో వైరల్

Viral Video : కారుని ఆపేందుకు రోడ్డు మధ్యలో కంటైనర్ ను నిలిపి ఉంచారు. దాంతో కారు డ్రైవర్ కారుని ఆపేశాడు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Viral Video : షాకింగ్.. పోలీస్‌ని 20 కిమీ లాక్కెళ్లిన కారు డ్రైవర్, వీడియో వైరల్

Viral Video (Photo : Google)

Viral Video : కొందరు వాహనదారులు రెచ్చిపోతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. తమ ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తోటి వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా మద్యం మత్తులో ఓ కార్డు డ్రైవర్ రెచ్చిపోయాడు. ఏకంగా ట్రాఫిక్ పోలీస్ నే 20 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. నవీ ముంబైలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ఆ కారు నడిపిన వ్యక్తి పేరు ఆదిత్య బెండే. వశీ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ సిద్దేశర్ మాలి దీన్ని గమనించాడు. వెంటనే కారుని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కారుకి అడ్డంగా నిల్చుని స్టాప్ అని బోర్డు చూపించాడు. కారుని ఆపాల్సిన ఆదిత్య.. అలాగే ముందుకుపోనిచ్చాడు.

ట్రాఫిక్ పోలీస్ మీదకి కారుని తోలాడు. దీంతో ట్రాఫిక్ పోలీస్ కారు బానెట్ పై చిక్కుకున్నాడు. అయినా కారు నడుపుతున్న ఆదిత్య అస్సలు తగ్గలేదు. కానిస్టేబుల్ ని కారు డ్రైవర్ అలానే 20 కిలోమీటర్లు ఈడ్డుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Phone Blast : బాబోయ్.. ఛార్జింగ్‌లో ఉండగా పెద్ద శబ్దంతో పేలిపోయిన ఫోన్, ముగ్గురికి తీవ్ర గాయాలు

కాగా, కారు నడిపి వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు అతడు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు తెలిసింది. కారు బానెట్ పై ట్రాఫిక్ పోలీస్ ఉండటాన్ని గమనించిన పోలీసులు.. కారుని ఆపేందుకు రోడ్డు మధ్యలో కంటైనర్ ను నిలిపి ఉంచారు. దాంతో కారు డ్రైవర్ కారుని ఆపేశాడు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అటెంప్ట్ మర్డర్, ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసులో నమోదు చేశారు. అయితే, ట్రాఫిక్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆయన సేఫ్ గానే ఉన్నారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read..Stray Dogs : భయానకం.. యూనివర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్‌ని కరిచి చంపిన వీధి కుక్కలు.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో