Stray Dogs : భయానకం.. యూనివర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్‌ని కరిచి చంపిన వీధి కుక్కలు.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో

Stray Dogs : ఒకేసారి ఏడు కుక్కలు దాడి చేయడంతో.. పాపం ఆ వ్యక్తి ఎంత నరకం అనుభవించి ఉంటాడోనని కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Stray Dogs : భయానకం.. యూనివర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్‌ని కరిచి చంపిన వీధి కుక్కలు.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో

Stray Dogs (Photo : Google)

Stray Dogs : దేశవ్యాప్తంగా కుక్కల దాడులు పెరిగిపోయాయి. వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు రౌండప్ చేసి దాడి చేస్తున్నాయి. విచక్షణారహితంగా కరిచి చంపుతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కల దాడి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రంగా గాయపరుస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తున్నాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో భయానక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కలు ఓ వ్యక్తిని కరిచి కరిచి చంపేశాయి. యూనివర్సిటీ క్యాంపస్ లోని పార్కులో సప్ధర్ అలీ(65) అనే రిటైర్డ్ డాక్టర్ తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో వాకింగ్ చేస్తున్నారు. అతడు ఫోన్ చూసుకుంటూ వాకింగ్ చేస్తున్నాడు.(Stray Dogs)

Also Read..Pit bull Dog Attacks : బాబోయ్.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికేసిన కుక్క, కొట్టి చంపిన జనం

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ, ఏకంగా వీధి కుక్కల గుంపు ఒకటి అక్కడికి వచ్చింది. ఆ గుంపులో 7 కుక్కలు ఉన్నాయి. తొలుత మూడు కుక్కలు ఆ వ్యక్తిపై దాడికి దిగాయి. చూస్తుండగానే.. మిగతా కుక్కల గుంపు కూడా దాడికి తెగబడింది. 7 కుక్కలు డాక్టర్ ను రౌండప్ చేశాయి. విచక్షణారహితంగా కరవడం ప్రారంభించాయి.

పాపం… కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ డాక్టర్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, లాభం లేకపోయింది. ఒకేసారి ఏడు కుక్కలు దాడి చేయడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఒక్కో కుక్క ఒక్కో పార్ట్ పై దాడి చేశాయి. అన్నీ కలిసి డాక్టర్ ను కిందపడేశాయి ఇష్టానుసారంగా కొరికేశాయి. కుక్కల దాడిలో తీవ్రగాయాలతో రిటైర్డ్ డాక్టర్ అలీ స్పాట్ లోనే చనిపోయారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న కుక్కల దాడి వీడియో చూసి నెటిజన్లు వణికిపోతున్నారు. వామ్మో అంటున్నారు. చాలా భయానకంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఒకేసారి ఏడు కుక్కలు దాడి చేయడంతో.. పాపం ఆ వ్యక్తి ఎంత నరకం అనుభవించి ఉంటాడోనని కన్నీటిపర్యంతం అవుతున్నారు. వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.(Stray Dogs)

ఆదివారం(ఏప్రిల్ 16) ఉదయం ఈ ఘటన జరిగింది. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపప్ తానా సివిల్ లైన్ ఏరియాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కుక్కల దాడి సమాచారం అందుకున్న పోలీసులు 7.30గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. డెడ్ బాడీని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read..Uttar Pradesh: వీధి కుక్కల భీకర దాడి.. తీవ్రగాయాలతో 11 ఏళ్ల బాలుడి మృతి

మృతుడి పేరు సప్ధర్ అలీ. ఓ రిటైర్డ్ డాక్టర్. ఆయన వయసు 65ఏళ్లు. సివిల్ లైన్స్ ఏరియాలో నివాసం ఉంటారు. వాకింగ్ కోసం యూనివర్సిటీ క్యాంపస్ కి వచ్చారు. కుక్కల గుంపు దాడి చేసి విచక్షణారహితంగా ఓ వ్యక్తిని కరిచి చంపడం సంచలనంగా మారింది. ఆ కుక్కలు దాడి చేసిన తీరు చూస్తే.. అసలు అవి వీధి కుక్కలా? క్రూర మృగాలా? అనే అనుమానం కలగకమానదని నెటిజన్లు అంటున్నారు. అసలు.. ఈ కుక్కలకు ఏమైంది? అని అంతా చర్చించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలతో ఒంటరిగా రోడ్డు మీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు.