Phone Blast : బాబోయ్.. ఛార్జింగ్‌లో ఉండగా పెద్ద శబ్దంతో పేలిపోయిన ఫోన్, ముగ్గురికి తీవ్ర గాయాలు

Phone Blast : ఫోన్ పేలి గుడిసెలో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ముగ్గురు మంటల్లో చిక్కుకున్నారు. తీవ్రంగా గాయపడ్డారు.

Phone Blast : బాబోయ్.. ఛార్జింగ్‌లో ఉండగా పెద్ద శబ్దంతో పేలిపోయిన ఫోన్, ముగ్గురికి తీవ్ర గాయాలు

Phone Blast (Photo : Google)

Phone Blast : మొబైల్ ఫోన్.. ఇప్పుడు అందరి జీవితాల్లో భాగమైపోయింది. చిన్న, పెద్ద.. పేద, ధనిక.. అనే తేడా లేదు. దాదాపు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. తిండి, నిద్ర లేకపోయినా ఉండగలరు. కానీ, చేతిలో ఫోన్ లేకుండా కాసేపు కూడా ఉండలేని వారు ఉన్నారు. అంతగా మొబైల్ కి అడిక్ట్ అయిపోయారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. దాదాపుగా అన్ని పనులు అయిపోతున్నాయి.

అందుకే, ఫోన్ కి అంతగా అడిక్ట్ అయ్యారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ ఫోన్లు బాంబుల్లా పేలిపోతున్నాయి. ప్రాణాలు తీసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు పేలిపోయిన ఘటనలు అనేకం జరిగాయి. ఈ ప్రమాదంలో కొందరు గాయాలతో బయటపడితే మరికొందరు మృత్యుఒడికి చేరుకున్నారు.

Also Read..Mobile Phone Explosion : బాబోయ్.. బాంబులా పేలిన మొబైల్ ఫోన్..! తీవ్ర గాయాలతో వృద్ధుడు మృతి

తాజాగా రాజస్తాన్ లోని బికనీర్ లో మొబైల్ ఫోన్ పేలిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఛార్జింగ్ ఉన్న ఫోన్ ఒక్కసారిగా బాంబులా పేలింది. అంతే గుడిసెలో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ముగ్గురు మంటల్లో చిక్కుకున్నారు. తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో బాలిక ముఖం కాలిపోయింది. యువకుడి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సెల్ ఫోన్ బ్యాటరీ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

బికనీర్ జిల్లాలోని లుంకరన్‌సర్‌లో ఈ ఘటన జరిగింది. ఫోన్ ను ఛార్జింగ్‌ పెట్టారు. అదే సమయంలో మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీ పేలింది. గుడిసెలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో గుడిసె కాలి బూడిదైంది.

Also Read..Dhone Cell Phone Blast : బాబోయ్.. డోన్‌లో ప్యాంట్ జేబులో పేలిన సెల్‌ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఈ సంఘటన శనివారం ఉదయం 10.30 నుండి 11 గంటల మధ్య లుంకరన్‌సర్‌లోని హన్సేరా గ్రామ పంచాయతీకి చెందిన మేఘవాల్ ధానిలో జరిగింది. ఓ గుడిసెలో పాత మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టారు. అదే సమయంలో ఫోన్ బ్యాటరీ పెద్ద శబ్దంతో పేలిపోయింది. మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు చిన్నారులు ఇంట్లో నిద్రిస్తున్నారు. మంటల్లో కాలిపోయిన 3 నెలల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల అరుపులు విని వారిని కాపాడేందుకు వచ్చిన మరో యువకుడికి రెండు చేతులు కాలిపోయాయి.

మంటల్లో చాలా వస్తువులు కాలి బూడిదయ్యాయి. 30వేల రూపాయల నగదు.. లక్ష రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు కూడా కాలిపోయాయి. ఫోన్ బ్యాటరీ పెద్ద శబ్దంతో పేలి గుడిసెలో మంటలు చెలరేగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగింది? అనేది తెలియాల్సి ఉంది.